ప్రదీప్‌ మాచిరాజు కోరిక బాగుంది.. నిజమవుతుందా?

ప్రదీప్‌… మంచి యాంకర్‌. స్పాంటేనిటీ ఉన్న యాంకర్‌. అడపాదడపా కొన్ని సినిమాల్లో కనిపించాడు. అయితే అవేవీ అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఆఖరికి ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాతో హీరోగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాట ఎంత హిట్‌ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ పాట ఏ రేంజిలో హిట్‌ అయ్యిందంటే… ‘పాటంత బాగుంటుంది సినిమా’ అంటూ ప్రచారం చేసుకునేంత హిట్‌ అయ్యింది. అయితే మరి ఈ సినిమాతో ప్రదీప్‌ హీరోగా ఆకట్టుకుంటాడా? అనేది చూడాలి.

ప్రదీప్‌లో మంచి నటుడు అయితే ఉన్నాడు… ఆ నటుడికి స్పాంటేనిటీ ఉంది. టీవీ షోస్‌లో ఇది కనిపిస్తూ ఉంటుంది. అయితే ‘30 రోజుల్లో…’ సినిమా పూర్తిగా లవ్‌ స్టోరీ అంటున్నారు. అయితే లవర్‌ బాయ్‌గా ఎలా కనిపిస్తాడనేది ఆసక్తికరంగా ఉంది. ఈ క్రమంలో ప్రదీప్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆసక్తికరంగా నిలిచాయి. త్రివిక్రమ్‌, సుకుమార్‌ లాంటి దర్శకుల సినిమాల్లో హీరోగా నటించే స్థాయికి ఎదగాలి అని ఆశిస్తున్నట్లు చెప్పాడు. మరి ఆ రేంజిలో మరి ప్రదీప్‌ నటించి మెప్పిస్తాడా? సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పాట తప్ప పెద్ద పరిచయం జనాలకు లేదు.

సినిమా ట్రైలర్‌ ప్రదీప్‌ కనిపించిన తీరుపై అంత పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ అయితే రాలేదు. ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌లో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ కనిపించలేదని అప్పుడే విమర్శలు వచ్చాయి. అయితే ఆ వెంటనే లాక్‌డౌన్‌ రావడంతో సినిమా విడుదల కాలేదు. ఈలోగా పాట బాగా హిట్‌ అయిపోయింది. దీంతో సినిమాకు యూఎస్‌పీగా ఆ పాట నిలిచింది. మరి అంత పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ లేని సినిమాలో ప్రదీప్‌ ఎలా ఆకట్టుకుంటాడా? అనేది ఈ రోజు తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus