Adi Reddy, Revanth: రేవంత్ కి ఆదిరెడ్డికి బిగ్ ఫైట్..! 13వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే..!

బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం నామినేషన్స్ హీటెక్కిపోయాయనే చెప్పాలి. ఫినాలేకి దగ్గర పడుతున్న కొద్ది హౌస్ మేట్స్ రెచ్చిపోయి మరీ ఆర్గ్యూ చేసుకుంటున్నారు. దీంట్లో భాగంగా 13వ వారం రేవంత్ ని , రోహిత్ ని టార్గెట్ చేశారు హౌస్ మేట్స్. ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదుకి వచ్చి వెళ్లిన తర్వాత అందరూ కాంపిటీటర్ రేవంత్ అనే చెప్పారు. దీంతో రేవంత్ ని టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఫైమా, ఆదిరెడ్డి ఇద్దరితో రేవంత్ కి గట్టి ఫైట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది.

ఆదిరెడ్డి అయితే, మరోసారి రేవంత్ తనతో మాట్లాడిన వీడియో టాపిక్ ని తీస్కుని వచ్చాడు. శ్రీహాన్ – శ్రీసత్య ఇద్దరూ ఉన్నప్పుడు అమ్మాయి అయితే టాస్క్ లో ఈజీగా గెలవచ్చని, వీక్ కంటెస్టెంట్ ఉంటుందని ఏదైతే ఆదిరెడ్డి చెప్పాడో అదే పాయింట్ కి కట్టుబడి ఉన్నాడు. ఇది వీకండ్ నాగార్జున గమీదా అంటూ స్టోరీ చెప్పి మరీ ప్రూవ్ చేసినా కూడా ఆదిరెడ్డి అదే పాయింట్ పై ఉన్నాడు. మనసాక్షి ఒకటి ఉంటుందని, దాని ప్రకారం నువ్వు అన్నావ్ అని, ఆ వీడియోకి ముందు వీడియో కట్ చేశారని

అది కూడా ప్లే చేసి ఉంటే తెలిసేదని చెప్పాడు. దీంతో ఆదిరెడ్డి తన పాయింట్ ని చాలా క్లియర్ గా పెట్టాడు. దీంతో రేవంత్ కి తిక్కరేగింది. ఎవరు చెప్పినా నువ్వు వినవ్ నామినేషన్ వేస్కుని వెళ్లిపో అంటే నేను వెళ్లను. నువ్వు అవసరమైతే సోఫా వెనక్కి వెళ్లి కూర్చో నేను చాలా మాట్లాడతా అంటూ రెచ్చిపోయాడు ఆదిరెడ్డి. దీంతో ఇద్దరికీ మరోసారి బిగ్ ఫైట్ అయ్యింది. రేవంత్ తనదైన స్టైల్లో వెళ్లి ఫిరంగి ముందు నుంచుని రంగు కొట్టించుకుని మరీ నామినేట్ అయ్యాడు.

ఇప్పుడు ఈ ప్రోమో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అంతేకాదు, నామినేషన్స్ లో ఈసారి ఫైమాకి ఇంకా ఆదిరెడ్డికి కూడా గట్టి ఫైట్ అయినట్లుగానే తెలుస్తోంది. అలాగే ఆదిరెడ్డికి ఇంకా శ్రీహాన్ కి కూడా మాటల యుద్ధం జరిగింది. దీంతో ఈవారం హౌస్ మేట్స్ తమ వేటని మొదలుపెట్టారు. ఫినాలే దగ్గర పడుతోంది కాబట్టి ఎదుటి వాళ్లని మాటలతోనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనిపిస్తోంది. ఫైమా కూడా మరోసారి రేవంత్ గేమ్ ని ఎత్తిచూపింది. అలాగే రేవంత్ కూడా ఫైమా, ఆదిరెడ్డిలపై విరుచుకుపడ్డాడు.

నిజానికి ఈ పాయింట్స్ అన్నీ కూడా గతవారం కంటే ముందు పాయింట్స్. లాస్ట్ వీక్ రేవంత్ కెప్టెన్ కాబట్టి ఇంటి సభ్యులు ఎవ్వరూ నామినేట్ చేయలేదు. అందుకే ఇప్పుడు నామినేట్ చేస్తున్నారు. ఇక ఈవారం నామినేషన్స్ లో ఇనయా కెప్టెన్ కాబట్టి ఎవరూ నామినేట్ చేయలేదు. అలాగే, శ్రీహాన్ కూడా సేఫ్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. దీంతో ఈసారి ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో రేవంత్, రోహిత్, శ్రీసత్య, ఫైమా, ఆదిరెడ్డి ఇంకా కీర్తి ఉన్నారు. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus