మెగా హీరోలు పదిమంది ఉన్నారు. వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వెళ్లడంతో.. ఆ స్థానం ఎవరిది? అనే చర్చ ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో జోరుగా సాగుతోంది. మెగాస్టార్ తర్వాత స్టైలిష్ స్టార్ అంటూ కొంతమంది అంటుంటే.. కాదు మెగా పవర్ స్టార్ అని చెబుతున్నారు. సరైనోడు విజయం తర్వాత బన్నీ క్రేజ్ పెరిగింది. అందుకే ఎక్కువ కంపెనీలు అతని వద్దకు చేరాయి. తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని కోరాయి. ఓఎల్ ఎక్స్, రెడ్ బస్, ఫ్రూటీ, లాట్స్ మొబైల్స్.. ఇలా అనేక కంపెనీలకు ప్రచార కర్తగా ఉన్నారు. సో అల్లు అర్జున్ బెస్ట్ అని అతని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా కార్పొరేట్ కంపెనీలు నిర్ధారించాయి.
బ్రాండ్స్ బట్టే బెస్ట్ అని ఎలా చెబుతారని రామ్ చరణ్ తేజ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రంగస్థలంతో రామ్ చరణ్ 200 కోట్ల క్లబ్ లో చేరారు. అల్లు అర్జున్ పేరిట ఉన్న రికార్డులన్నిటినీ క్రాస్ చేసాడు, సో చెర్రీ బెస్ట్ అని వాదిస్తున్నారు. ఇలా అభిమానుల మధ్య వార్ జరుగుతోంది. ఈ విషయం గురించి మెగా కుటుంబ సభ్యులను అడగగా.. వారు లైట్ తీసుకుంటున్నారు. ఒకరి రికార్డును.. మరొకరు క్రాస్ చేసుకుంటూ వెళుతున్నారు. అంతేతప్ప ఎవరు గొప్ప అనేది సీరియస్ గా అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. నా పేరు సూర్యతో ఫెయిల్ చూసిన బన్నీ ఈసారి రంగస్థలం మించి హిట్ కొట్టాలని భావిస్తున్నారు.