రష్మీని అలా కామెంట్ చేసిన నెటిజన్.. చివరకు..?

బుల్లితెర షోలలో ఒకటైన జబర్దస్త్ షోతో యాంకర్ గా రష్మీ ప్రయాణం మొదలైంది. జబర్దస్త్, ఢీ మినహా పెద్దగా రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించకపోయినా రష్మీకి సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే రష్మీ తన ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ అభిమానుల మధ్య మాటలయుద్ధానికి కారణమైంది. తాజాగా రష్మీ గ్రే కలర్ డ్రెస్ లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

రష్మీ షేర్ చేసిన ఈ ఫోటోకు ఏకంగా 1,23,780 లైకులు వచ్చాయి. ఆ ఫోటోను చూసి రష్మీ ఫ్యాన్స్ లో ఒకరు “ఏమిటో రోజురోజుకు దిగజారిపోతున్నారు” అని కామెంట్ పెట్టారు. ఆ తరువాత ఆ కామెంట్ ను సపోర్ట్ చేస్తూ కొంతమంది అతనికి సపోర్ట్ చేయగా మరికొంత మంది మాత్రం అతనిని ట్రోల్ చేస్తూ కామెంట్లు చేశారు. అలా రష్మీ ఫ్యాన్స్ మధ్య చిన్నగా మొదలైన మాటల యుద్ధం చివరకు చిలికి చిలికి గాలివానలా మారింది.

అయితే రష్మీ మాత్రం ఈ మాట్ల యుద్ధం విషయంలో సైలెంట్ గా ఉన్నారు. గతంలో కొందరు యాంకర్ల డ్రెస్ ల విషయంలో కూడా ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమైన సంగతి తెలిసిందే. గతంలో అనసూయ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోల విషయంలో కూడా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. మరోవైపు రష్మీ బుల్లితెర షోలతో పాటు సినిమా ఆఫర్లతో కూడా బిజీగా ఉన్నారు.

Once again Rashmi fires on netizens1

రష్మి, నందు బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.