యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) సినిమా హిందీ వెర్షన్ ను కూడా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో చాలామంది దేవర హిందీ వెర్షన్ కచ్చితంగా సక్సెస్ సాధించాలని కోరుకున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగా దేవర హిందీ వెర్షన్ కలెక్షన్ల విషయంలో సత్తా చాటింది. అదే సమయంలో తారక్ భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ (RRR) , దేవర సినిమాలతో హిందీ మార్కెట్ లో సత్తా చాటగా వార్2 సినిమా స్ట్రెయిట్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
Jr NTR
బాలీవుడ్ లో మార్కెట్ ను ఎన్నో రెట్లు పెంచుకోవడంలో జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాతో సక్సెస్ కావడం పక్కా అని చెప్పవచ్చు. తారక్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీకి వార్2 మూవీ ఎంతో ప్లస్ కానుందని చెప్పవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలపై ఎక్కువ మొత్తం బడ్జెట్ పెట్టినా వర్కౌట్ కావడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తారక్ తో సినిమాలను నిర్మించాలని ఆశ పడుతున్న నిర్మాతల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతోంది.
తారక్ కెరీర్ ప్లానింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఊహించని స్థాయిలో ఉంది. భిన్నమైన కథలను ఎంచుకోవడం తారక్ కు ఎంతగానో ప్లస్ అవుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
సోషల్ మీడియాపై కూడా తారక్ దృష్టి పెడితే ఎన్నో సంచలనాలు సృష్టిస్తారని చెప్పవచ్చు. ఓవర్సీస్ లో సైతం తారక్ మార్కెట్ పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చే, ఫ్యాన్స్ మెచ్చే సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.