ఫిబ్రవరిలో సినీ పరిశ్రమ కోల్పోయిన ప్రముఖులు వీరే..!

  • February 28, 2023 / 12:08 PM IST

చిత్ర పరిశ్రమలో ఫిబ్రవరి నెలలో తీవ్ర విషాదం నెలకొంది.. పలు భాషల్లో, వివిధ రంగాలకు చెందిన సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. ప్రేక్షకాభిమానులను శోకసంద్రంలో ముంచెత్తారు.. వరుస మరణాల వార్తలతో.. ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని పరిశ్రమ వర్గాలు కంగారు పడ్డాయి.. ఒక మరణం గురించి మాట్లాడుకుంటుండగానే మరో ప్రముఖ వ్యక్తి లేరని తెలియడంతో అందరిలోనూ అలజడి..

కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు మరణించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన సతీమణి జయలక్ష్మీ కూడా కన్నుమూయడం బాధాకరం.. లెజెండరీ సింగర్ వాణి జయరాం అనుమానాస్పద మృతి.. గుండెపోటుకి గురై దాదాపు 23 రోజుల పాటు ఆసుపత్రి బెడ్ మీద ఉన్న నందమూరి తారక రత్న మరణం అందర్నీ షాక్‌కి గురిచేసింది.. ఫిబ్రవరిలో స్వర్గస్తులైన సినీ ప్రముఖుల ఎవరో ఇప్పుడు చూద్దాం..

కె. విశ్వనాథ్..

అపురూపమైన చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శక దిగ్గజం, అద్భుతమైన కళాఖండాలను చిత్ర పరిశ్రమకు అందించి, ప్రేక్షకులు సినిమా చూసే విధానాన్ని మార్చిన ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్ ఫిబ్రవరి 2న 92 సంవత్సరాల వయసులో వృద్దాప్య సమస్యల కారణంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. ఫిబ్రవరి 19 వారి పుట్టినరోజు కావడం విశేషం..

కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మీ..

కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మీ.. భర్త మరణించే నాటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.. తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 26 సాయంత్రం తుదిశ్వాస విడిచారు.. విశ్వనాథ్ మృతి చెందిన వార్డులోనే ఆమె కన్నుమూయడం బాధాకరం..

వాణి జయరాం..

ప్రముఖ గాయని వాణీ జయరాం దాదాపు 14 భాషలలో సుమారు పదివేలకు పైగా అద్భుతమైన పాటలను ఆలపించి ప్రేక్షకుల హృదయాల్లో చెరుగని ముద్ర వేశారు.. చెన్నైలోని తన నివాసంలో ఫిబ్రవరి 4న అనుమానాస్పద రీతీలో మృతి చెందారు.. కొద్ది రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్‌ ప్రకటించింది..

నందమూరి తారక రత్న..

రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని.. ఇక పై ప్రజాసేవలోనే జీవించాలని కలలు కన్న యువ నటుడు నందమూరి తారక రత్న జనవరి 27న కుప్పం పాదయాత్రలో గుండెపోటుకి గురవడం.. అక్కడే చికిత్స తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో 23 రోజుల పాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ.. చివరికి ఫిబ్రవరి 18న శివరాత్రి రోజే శివైక్యం అయ్యారు..

జీ జీ కృష్ణా రావు..

‘శంకరాభరణం’ చిత్రానికి కూర్పు వహించిన జీ జీ కృష్ణారావు కన్నుమూశారు.. ఫిబ్రవరి 21 ఉదయం బెంగుళూరులోని తన నివాసంలో ఆయన శివైక్యం అయ్యారు.. దాదాపు 200 సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. బాలకృష్ణ సోలో హీరోగా, కె. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ‘జననీ జన్మభూమి’ కూడా ఈయన వర్క్ చేశారు.. దాసరి, విశ్వనాథ్, జంధ్యాల, బాపు దర్శకదిగ్గజాలతో పాటు పలువురు ప్రముఖ దర్శకుల సినిమాలకు తన కత్తెరతో పదును పెట్టారు కృష్ణారావు..

అలాగే ప్రముఖ తమిళ హాస్యనటుడు, దర్శకుడు టి.పి. గజేంద్రన్ (తమిళ్), కమెడియన్ మైల్ స్వామి (తమిళ్), సీనియర్ రంగస్థలం మరియు సినిమా నటుడు తంగరాజ్ (తమిళ్), ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ (గోరఖ్ పూర్) రవి కిషన్ అన్నయ్య రామ్ కిషన్ శుక్లా.. సీనియర్ కన్నడ డైరెక్టర్ ఎస్.కె. భగవాన్, సీనియర్ నటి బేలా బోస్ (హిందీ – భోజ్‌పురి), మలయాళీ కమెడియన్, నటి సుబి సురేష్, క్లాసికల్ డ్యాన్సర్, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత కనక్ రెలే, జోసెఫ్ మను జేమ్స్ (మలయాళీ డైరెక్టర్) వంటి వారు ఈ ఫిబ్రవరి నెలలో కన్నుమూశారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus