Allu Arvind, Bunny Vas: గీతా vs పరశురామ్‌… అసలేం జరిగింది అంటే.. బన్ని వాస్‌ క్లారిటీ!

‘ఫ్యామిలీ స్టార్‌’ (అప్పటికి పేరు పెట్టలేదు లెండి) సినిమా అనౌన్స్‌మెంట్‌ అయిన వెంటనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఓ ప్రెస్‌ మీట్‌ పెడతారు అని టాక్‌ వచ్చింది గుర్తుందా? అయితే ఏమైందో ఏమో తర్వాత ప్రెస్‌మీట్‌ క్యాన్సిల్‌ చేసేశారు. ఎందుకు పెడతా అన్నారు, ఏం మాట్లాడతా అన్నారు, ఆ తర్వాత ఎందుకు క్యాన్సిల్ చేసేశారు లాంటి ప్రశ్నలు ఆ సమయంలో చాలానే వచ్చాయి. అప్పుడు ఈ విషయంలో ఆన్సర్‌ రాలేదు కానీ… చాలా రకాల పుకార్లు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.

గీతా ఆర్ట్స్‌ సన్నిహితుడు నిర్మాత బన్ని వాస్‌ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నాటి విషయాల గురించి ప్రస్తావించారు. ఏం జరిగింది, ఏం చేయాలనుకున్నారు, ఎందుకు ఆగిపోయారు లాంటి అనే ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తొలుత వచ్చిన పుకార్ల ప్రకారం… ఈ మొత్తం వ్యవహారానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమానే కారణం. ఆ సినిమా కాంబినేషనే కారణమట. అయితే ఇప్పుడు అంతా సమసిపోయిందట.

సరైన విజయాలు లేని సమయంలో అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పట్ల ఆ దర్శకుడికి మంచి బంధమే ఉంటుంది. అలా గీతా ఆర్ట్స్‌ చాలామంది అవకాశాలు ఇచ్చింది. అందులో పరశురాం కూడా ఒకరు. ‘సారొచ్చారు’ సినిమాతో ఫ్లాప్ రుచి చూసిన ఆయనకు వరుస అవకాశాలు ఇచ్చింది ఆ బ్యానర్‌. ‘శ్రీరస్తు శుభమస్తు’తో తిరిగి హిట్‌ ట్రాక్‌ ఎక్కిన పరశురాం.. ఆ వెంటనే విజయ్ దేవరకొండ – రష్మికతో ‘గీత గోవిందం’ చేశారు. ఆ సినిమాతోనే మహేష్‌ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా ఛాన్స్‌ పట్టేశారు.

అయితే ఆ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్‌లో పరశురామ్‌ ఓ సినిమా చేయాల్సింది. విజయ్‌ దేవరకొండ హీరోగానే ఆ సినిమా ఉంటుంది అని చెప్పారు కూడా. కానీ ఏమైందో ఏమో విజయ్‌ – పరశురాం కలసి దిల్ రాజు బ్యానర్‌లో ‘ఫ్యామిలీ స్టార్‌’ అనౌన్స్‌ చేశారు. ఆ విషయంలో అల్లు అరవింద్ హర్టయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై అరవింద్ ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమయ్యారట. కానీ తర్వాత ఆగిపోయారు. దీని గురించి బన్ని వాస్‌ మాట్లాడారు.

“గీత గోవిందం’ తర్వాత విజయ్ – పరశురామ్ కాంబినేషన్‌లో మరో సినిమా చేయాలనుకున్నాం. కథ కూడా అనుకున్నాం. అయితే… ఓ రోజు విజయ్ ఫోన్ చేసి పరశురామ్ ఇంకో కథ చెప్పారని, అది తనకు నచ్చిందని చెప్పారు. అయితే ఆ సినిమా దిల్ రాజు నిర్మాణంలో చేస్తానని చెప్పారు. ఈ విషయం అరవింద్ గారిని బాధించింది. పరశురాం ఈ విషయాన్ని మాకు సరిగా చెప్పలేదు. అసలు విషయం పరశురాం ద్వారా కాకుండా వేరే మార్గంలో తెలియడంతో హర్టయ్యారు’’ అని (Bunny Vas) బన్ని వాస్‌ చెప్పారు.

అయితే ఆ తర్వాత పరశురామ్ ఫోన్ చేసి వేరే బ్యానర్‌లో చేద్దాం అనుకున్న లైన్‌ను దిల్ రాజుకు చెబితే ఆయన సినిమా ఓకే చేశారని, అప్పటికే ఆ కథ విజయ్‌కి నచ్చడంతో చేయడానికి రెడీ అయ్యారని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం పొద్దున చెబుదాం అనుకునే లోపు అలా బయటకు వచ్చేసిందని పరశురాం చెప్పారట. ఇప్పుడు అంతా సమసిపోయిందని.. విజయ్‌ – పరశురాం కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుంది అని చెప్పారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus