SSMB28 విషయంలో మహేష్‌ ఎక్కువగా ఆలోచిస్తున్నాడా?

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కలయికలో సినిమా.. ఇంతకుమించిన కాంబినేషన్‌ ఇంకొకటి ఉండదు అని అభిమానులు ఆనందించారు. 12 ఏళ్ల తర్వాత వస్తున్న కాంబో అయ్యేసరికి ఆ ఆనందం మామూలుగా లేదు. అయితే ఆ ఆనందం ఇప్పుడు కొంచెం కొంచెం బాధగా మారుతోందా? అవుననే అంటున్నారు కొంతమంది అభిమానులు. సోషల్‌ మీడియా వేదికగా.. కొంతమంది ఫ్యాన్స్‌ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం సినిమా గురించి రోజు రోజుకు వినిపిస్తున్న మాటలే.

మహేస్‌ – త్రివిక్రమ్‌ సినిమా ప్రారంభానికి ముందు చాలా చర్చలు, పుకార్లు వినిపించాయి. మహేష్‌కు కథ నచ్చలేదని కొన్ని వార్తలు, అసలే కథే రెడీ కాలేదని ఇంకొన్ని వార్తలు వినిపించాయి. ఈలోపు మహేష్‌ రెండు, మూడు విదేశీ పర్యటనలు కూడా అయిపోయాయి. అలా ఎన్నో వాయిదాల తర్వాత కొన్ని రోజుల క్రితం SSMB28 సినిమా మొదలైంది. ఫైట్‌ సీన్‌తో సినిమాను ఘనంగా ప్రారంభించింది చిత్రబృందం. కానీ తొలి రోజు షూటింగ్‌ నుండి ఏదో ఇబ్బందిగానే సాగింది అని టాక్‌ నడిచింది.

సినిమా విషయంలో మహేష్‌ బాబు సంతృప్తిగా లేరని, కథ ఇలా కాకుండా వేరేలా ఉండాలని అంటున్నారట. యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలని త్రివిక్రమ్‌కు సూచించారట. దీంతో సినిమా కొత్త షెడ్యూల్‌కు చాలా టైమ్‌ పడుతోందని టాక్‌ వినిపించింది. ఈ క్రమంలో ఏకంగా సినిమా ఆగిపోయింది అని కూడా అన్నారు. అయితే నిర్మాత నాగవంశీ మాత్రం త్వరలో షూటింగ్‌ అంటూ ఓ ట్వీట్‌ చేసి కామ్‌ అయిపోయారు.

సినిమా విషయంలో ఏం జరుగుతోంది, ఎందుకు ఎప్పుడూ లేనిది ఇన్ని చర్చలు జరుగుతున్నాయి. లేని పోని పుకార్లు ఎందుకొస్తున్నాయి అనేదే అభిమానుల ప్రశ్న. మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా విషయంలో ఇలా జరగడం సరికాదు అంటున్నారు. ఇలాంటి అనవసర పుకార్లకు కారణం సరైన సమయంలో షూటింగ్‌ మొదలుకాకపోవడమే అంటున్నారు. పక్కాగా టైమింగ్‌లు చెప్పి షూటింగ్‌లు చేసేసుకుంటే ఇలాంటి పుకార్లు వచ్చేవి కావు కదా అని అంటున్నారు. దీంతో ఇప్పటికైనా టీమ్‌ ఈ పుకార్ల షికార్లకు బ్రేక్‌లు కుదిరితే.. పూర్తి ఆపేస్తే బెటర్‌.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus