‘ఆస్కార్‌’ వేదికపై ‘నాటు నాటు’ డ్యాన్స్‌ విషయంలో సందేహాలు.. ఏమైంది అసలు?

రామ్‌చరణ్‌ – తారక్‌ మంచి స్నేహితులు.. ఈ విషయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం వరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలు అప్పటివరకు ఏ రోజూ కలసి ఒక చోట కనిపించింది లేదు, ఒకరి గురించి ఒకరు ట్వీట్స్‌ చేసుకుంది లేదు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారంలో ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. మేం మంచి స్నేహితులమని, మిడ్‌నైట్‌ బయట సరదాగా తిరిగే అంత క్లోజ్‌ ఉందని, ఒకరి పుట్టిన రోజున ఒకరు రాత్రి ఇంటికొచ్చి పికప్‌ చేసుకుని పార్టీ చేసుకునేవాళ్లమని.. చాలానే చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు అదంతా కనిపించడం లేదు అనుకోండి. ఇదే కాదు.. ఇప్పుడు ఏకంగా ఒకే విషయంలో చెరో సమాధానం వస్తోంది, చెరో స్పందన వస్తోంది. ఆస్కార్‌ వేదిక మీద ‘నాటు నాటు..’ పాట ప్రదర్శిస్తారు అనే వార్త వచ్చినప్పుడు ‘తారక్‌, చరణ్‌ డ్యాన్స్‌ వేస్తారా?’ అనే చర్చ కూడా వచ్చింది. ఎందుకంటే ఆ పాట అంత హిట్‌ అవ్వడానికి వాళ్లు వేసిన స్టెప్పులు కూడా కారణం. అయితే డ్యాన్స్‌ చేయడం లేదు, ఓన్లీ అమెరికన్‌ డ్యాన్సర్స్‌ చేస్తారు.. కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడతారు అని తెలిపారు.

దీంతో పాట పాడటం వరకే మనవాళ్లకా అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు వేర్వరు వాదనలు వినిపించాయి. దీంతో ఇద్దరి మధ్య స్నేహం బెడిసికొట్టిందా? లేక అసలు గతంలో స్నేహం లేకపోయినా ‘బాలీవుడ్ బంధం’ స్టైల్‌లో స్నేహం చేశారా అని అనిపిస్తోంది. ఆస్కార్ వేదిక‌పై డాన్స్ చేస్తారా? అని రామ్‌చరణ్‌ను అడిగితే ‘డాన్స్ చేయ‌డానికి ఇన్విటేష‌న్ రాలేదు’’ అని చెప్పాడు. ఇదే మాట ఎన్టీఆర్‌ దగ్గర అడిగితే ‘‘ఆస్కార్ వేదిక‌పై డాన్స్ చేయాల‌ని పిలుపు వ‌చ్చింద‌ని, కానీ రిహార్స‌ల్స్ చేయ‌డానికి టైమ్ లేక‌పోవ‌డంతో చేయ‌ట్లేదు’’ అని చెప్పాడు.

అప్పుడు ఎన్టీఆర్ అలా అంటే.. ఇప్పుడు చ‌ర‌ణ్ ఇన్విటేష‌న్ రాలేద‌ని చెప్ప‌డం గమనార్హం. ఇది కమ్యూనికేషన్‌ గ్యాపా, లేక ఫ్రెండ్‌షిప్‌లో గ్యాపా అనేది తెలియడం లేదు. అన్నట్లు రామ్‌చరణ్‌ ట్వీట్స్‌లో తారక్‌ పేరు కనిపిస్తోంది కానీ, ఎన్టీఆర్‌ ట్వీట్స్‌లో చరణ్‌ ప్రస్తావన కనిపించడం లేదు. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. సెలబ్రిటీల ట్వీట్లు, ఆ లెక్కలన్నీ వాళ్ల సోషల్‌ మీడియా మేనేజర్‌లు చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్లు ఏమైనా చరణ్‌ పేరు మరచిపోయారా (?) లేక తారక్‌ మరచిపోయాడా అనేది తెలియాల్సి ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus