Sai Pallavi: సాయిపల్లవి చుట్టూ ఈ రూమర్స్‌… నిజమేనా

ఫలానా హీరోయిన్‌ ఓ సినిమా ఓకే చేసిందని, ఓ ఛాన్స్‌ వద్దనుకుందని రకరకాల పుకార్లు, వార్తలు వస్తుంటాయి. అందులో అన్నీ నిజమవ్వాలని లేదు. సినిమాలకు సంబంధంచి పుకార్లలో చాలావరకు నిజమవుతూనే ఉంటాయి. అయితే ఏమాత్రం నిజం కాని పుకార్లు వస్తే ఆ హీరోయిన్‌ కానీ, ఆ హీరోయిన్‌ పీఆర్‌ టీమ్‌ కానీ చెప్పాలి. అప్పుడే అభిమానులు, ప్రేక్షకుల్లో చిన్న క్లారిటీ వచ్చేస్తుంది. తాజాగా ఈ పరిస్థితి సాయిపల్లవి విషయంలో జరుగుతోంది. వరుసగా ఆమె సినిమాలు వద్దనుకుంటోంది అంటూ వార్తలొస్తున్నాయి.

ఓ సినిమా చర్చలు జరుగుతున్నప్పుడు అందులో హీరోయిన్‌ పాత్ర కోసం చాలామందిని అనుకుంటారు. కానీ ఎవరో ఒక్కరే ఓకే అవుతారు. అయితే సినిమా విషయంలో ఓకే అనుకున్నాక.. ఇక సెట్స్‌లో ఎంటర్ అవ్వడమే అనుకున్న సమయంలో వెనక్కి వెళ్లిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అలా ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ సినిమా విషయంలో సాయిపల్లవి వెనక్కి తగ్గిందని ఆ మధ్య వార్తలొచ్చాయి. పవన్‌ కల్యాణ్ భార్య పాత్రలో సాయిపల్లవి ఓకే అని.. మళ్లీ నో అనేసిందని వార్తలొస్తున్నాయి.

తాజాగా సాయిపల్లవి బాలీవుడ్‌ ఎంట్రీకి నో చెప్పిందనే మాటలూ వినిపిస్తున్నాయి. ‘ఛత్రపతి’ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళ్లాలని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సిద్ధమయ్యాడు. ఇందులో కథానాయికగా బాలీవుడ్ హీరోయిన్లను అనుకొని, ఆఖరికి సాయిపల్లవిని ఓకే చేసుకుందాం అనుకున్నారట. అయితే ఆమె నో చెప్పిందని సమాచారం. బాలీవుడ్‌ ఎంట్రీని కాదనే సౌత్‌ నాయికలు చాలా తక్కువ. మరి సాయిపల్లవి ఎందుకు వద్దనుకుందో. బెల్లంబాబు సినిమా కాబట్టి రెమ్యూనరేషన్‌ కూడా ఎక్కువే ఉంటుంది. అయినా వద్దనుకుందట.

‘ఛత్రపతి’ రీమేక్‌ విషయంలో సాయిపల్లవి అలా చేయడానికి… పాత్ర నిడివి, ప్రాధాన్యత పెద్దగా లేకపోవడమే కారణం అని వార్తలొస్తున్నాయి. అయితే సాయిపల్లవి గతంలో ‘మారి 2’, ‘ఎన్జీకే’లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలు చేసింది. కాబట్టి దానిని కారణం అనకపోవచ్చు. లేదంటే అసలు ‘ఛత్రపతి’ రీమేక్‌ టీమ్‌ను ఆమెనే కాంటాక్టే చేసుండకపోవచ్చు. వీటిపై సాయిపల్లవి కాకపోయినా, ఆమె పీఆర్‌ టీమ్‌ అయినా స్పందిస్తే పుకార్లు ఆగుతాయేమో కదా.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus