రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్నారు. కథలో కీలకమైన ఆయన పాత్రపై ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ చరణ్, ఎన్టీఆర్ లకు గురువుగా కనిపిస్తారట. భీమ్, అల్లూరిలకు దొరలపై పోరాడడానికి కావలసిన యుద్ధ విద్యలు నేర్పి మనో ధైర్యం నింపే గురువుగా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తుంది.
ఐతే ఈ పాత్రను మెగాస్టార్ చిరంజీవి చేసి ఉంటే ఆర్ ఆర్ ఆర్ రేంజ్ మరో స్థాయికి చేరేదని కొందరి వాదన. వయసు పరంగా, ఇమేజ్ పరంగా చిరంజీవి ఆ పాత్రకు చక్కగా సరిపోయేవాడు. చిరు ఇమేజ్ కూడా ఆర్ ఆర్ ఆర్ కి తోడై భారీ ప్రచారం దక్కేది. ఐతే రాజమౌళి కి ఈ ఆలోచన రాకుండా ఉండివుండదు. ఒక వేళ వస్తే చిరంజీవికి బదులు అజయ్ దేవ్ గణ్ ని ఎందుకు తీసుకున్నారంటే…ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి.
హిందీలో కూడా ఈ మూవీ విడుదల అవుతుండగా అక్కడ ఆర్ ఆర్ ఆర్ కి ప్రచారం దక్కాలంటే ఆ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నటుడు ఉండాలి. అందుకే అలోచించి రాజమౌళి ఈ మూవీ కోసం అజయ్ దేవ్ గణ్ ని తీసుకున్నారు. ఇక అజయ్ దేవ్ గణ్ కూడా ఊరికే ఈ మూవీలో పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. ఆయనకు హిందీ వర్షన్ ఆర్ ఆర్ ఆర్ విడుదల హక్కులు ఇవ్వడం జరిగింది. తీవ్ర పోటీ మధ్య అజయ్ దేవ్ గణ్ కి ఆర్ ఆర్ ఆర్ హిందీ హక్కులు ఆయన ఈ చిత్రంలో నటించడం వలనే దక్కించుకోగలిగాడు.
Most Recommended Video
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!