ప్రముఖ సినీ నటులతో ఇంటర్వ్యూ లు చేసి యూ ట్యూబ్ లో బాగా పాపులర్ అయిన వ్యక్తి టిఎన్ఆర్. “ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్” అని అయన చేసే ఇంటర్వ్యూ లలో అనేక ఆసక్తికర సంగతులు బయటికి వస్తుంటాయి. అందుకే అతని వీడియోలు చూసేందుకు నెటిజనులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఆ ఇంటర్వ్యూ కి నావిక ఫ్యాక్టరీ వారు “వాట్ ఇఫ్ టిఎన్ఆర్ ఇంటర్వూస్ ఎ రాంగ్ పర్సన్ ?” అనే పేరుతో స్పూఫ్ రూపొందించారు. ఇందులో టిఎన్ఆర్ గా సంజీవి, మైక్ రాజు గా దుర్గ ప్రసాద్ చక్కగా ఇమిటేట్ చేశారు. ప్రోమోల దగ్గర నుంచి మేకింగ్ విధానం బాగా నవ్విస్తుంది.
23 ఏళ్లపాటు నాన్ స్టాప్ గా ఈ ఇంటర్వ్యూ సాగుతుందని చూపించి వీడియో లెన్త్ పై సెటైర్ వేశారు. “మా వీడియోలకు ఎడిటింగ్ ఉండదు” అంటూ పంచ్ లు పేల్చారు. ముఖ్యం గా ఐదు రూపాయల బిళ్ల గిఫ్ట్ గా ఇచ్చే సందర్భాన్ని వర్ణించడం పగలబడి నవ్వేలా చేస్తుంది. టిఎన్ఆర్ తన ప్రతి ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మని ప్రస్తావిస్తుంటారు .. ఆ విషయం కూడా ఇందులో మిస్ కాలేదు. “ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్” ఫాలో అయ్యే వారికి ఈ వీడియో బాగా కనెక్ట్ అవుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.