రాజకీయాల్లో రాజీనామాకు చాలా ప్రాధాన్యముంది. ఒక విషయం మీద అసంతృప్తి చెప్పడానికి, అవతలి పార్టీని ఇరుకన పెట్టడానికి రాజీనామా అస్త్రం సంధిస్తుంటారు మన నాయకులు. ఇప్పుడు ఈ స్టైల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లోకి వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన… ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చెందిన 11 మంది రాజీనామా చేసేశారు. ఓడిపోయారనే కోపంతో ఈ పని చేశారు అనుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రకాశ్‌రాజ్ రాజకీయం కూడా కనిపిస్తోంది. గత రెండు పర్యాయాలు చూసుకుంటే…
మిక్సడ్ ప్యానల్సే కనిపించాయి. అంటే రెండు ప్యానల్స్ తరఫు నుండి పోటీ చేసి గెలిచినవాళ్లు అంతా కలసి ఒక ప్యానల్‌గా ఏర్పడి ఆ రెండేళ్లు ఉంటారు. అయితే రెండు వేర్వేరు ప్యానల్స్ నుండి వచ్చినవాళ్లు కావడంతో మధ్యలో ఆరోపణలు, కోపాలు, అలకలు చాలా ఉంటాయి. ఒకరు చేసిన, చేద్దామనుకున్న పనులు… వేరే ప్యానల్‌లో గెలిచిన సభ్యులు వద్దు అంటుంటారు. ఈ మాట మనం అన్నది కాదు గత ప్యానల్స్‌లో ఉన్నవాళ్లు చెప్పిందే. అంతెందుకు ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచినవాళ్లు కూడా ఇదే మాట చెప్పి రిజైన్ చేశారు.
దీంతో ప్రకాశ్‌రాజ్ ఇప్పడు ఏం చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. కలసి ఒకే ప్యానల్‌గా ఉండి, ఆఖర్లో విమర్శలు గుప్పించుకొని ఎన్నికలకు రావడం ఇప్పటివరకు చూశాం. ఇప్పుడు బయట ఉండి… చేసిన ప్రతి పనిలో తప్పులు వెతకడం ఇప్పుడు చూడొచ్చు. అయితే ఈ పని నిర్మాణత్మకంగా ఉంటే… అందరూ హర్షిస్తారు. అలా కాకుండా ప్రతి చిన్న విషయానికీ విమర్శిస్తే మాత్రం హర్షించే అవకాశమే ఉండదు. రెండో ప్యానల్‌లో ఉంటే మళ్లీ ఎన్నికల వచ్చినంతవరకు వెయిట్ చేసి… అప్పుడు ప్రచారం చేయాలి.
ఈ ఎన్నికల విషయంలో ఇలాంటి విమర్శలే వచ్చాయి. ప్యానల్ ఫోర్స్‌లో ఉండగానే… అందులో సభ్యులు బయటకు వచ్చి ఆ ప్యానల్ తరఫు ప్రెస్‌మీట్‌కి వచ్చారు అని విమర్శించారు. ఇప్పుడు అవసరమైతే ఆరేడు నెలల ముందే ప్రెస్‌మీట్లు పెట్టి మరీ… మంచు విష్ణు ప్యానల్ చేస్తున్న పనులపై మాట్లాడొచ్చు. అలాగే… విష్ణు కూడా మాకు వాళ్లు పని చేసే అవకాశం ఇవ్వడం లేదు అనే మాట కూడా రాదు. కాబట్టి ప్రకాశ్‌రాజ్ ప్యానల్ రాజీనామాలు ఓకే చేస్తే… విష్ణు తన పక్కలో బల్లెం పెట్టుకున్నట్టే.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు