బిగ్ బాస్ 4: అఖిల్ సీక్రెట్ రూమ్ నుంచి ఎప్పుడు వస్తాడు..?

బిగ్ బాస్ హౌస్ ల 10వ వారం అఖిల్ సీక్రెట్ రూమ్ కి వెళ్లడం అనేది ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు మళ్లీ తిరిగి అఖిల్ ఎప్పుడు హౌస్ లోకి వస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి నెక్ట్స్ వీక్ ఎవరికీ ఇమ్యూనిటి లేదు కాబట్టి ఖచ్చితంగా శనివారం, ఆదివారం నాగార్జున యాంకరింగ్ చేసేటపుడే వచ్చేయాలి. వేరే ఆప్షన్ లేదు. అప్పుడే 11వ వారం నామినేషన్స్ లో ఉంటాడు. గేమ్ జెన్యూన్ గా వెళ్తుంది. అలా కాకుండా ఒకవారం పాటు ఉంచితే అది మిగతా హౌస్ మేట్స్ కి అన్ ఫెయిర్ అనే అనిపిస్తుంది. ఒకవారం ఇమ్యూనిటి ఉచితంగా రావడం అనేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది కనక ఖచ్చితంగా నాగార్జున అఖిల్ ని రివీల్ చేస్తాడనే అంటున్నారు అందరూ.

అయితే, ఈసారి ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా అనే న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాల హల్ చల్ చేస్తోంది. వస్తోంది దీపావళి పండగ కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేషన్ తీసేస్తారని చెప్తున్నారు.

ప్రస్తుతం అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లలో చూస్తే ఈవారం డేంజర్ జోన్ లో మెహబూబ్ ఇంకా మోనాల్ ఇద్దరూ ఉన్నారు. వీరిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది జరుగేటట్లుగా కనిపిస్తోంది. అయితే, ఇక్కడే బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చి అఖిల్ ని ఫేక్ ఎలిమినేషన్ చేసి మరీ మరోసారి సీక్రెట్ రూమ్ లోకి పంపించే అవకాశం కూడా ఉంది. అప్పుడు మెహబూబ్ అండ్ మోనాల్ ఇద్దరూ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎలిమినేషన్ తీసేసి ఈ ఫేక్ ఎలిమినేష్ చేయచ్చు. అలాకాకుండా శనివారమే అఖిల్ ని సీక్రెట్ రూమ్ నుంచి బయటకి తీసుకుని వస్తే రెగ్యులర్ గానే ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది.

మరి చూద్దాం. ఈసారి బిగ్ బాస్ ఎలాంటి బిగ్ ట్విస్ట్ ఇస్తాడు అనేది.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus