Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » MAA Elections: ‘మా’ ఎన్నికలకు ప్రెస్‌మీట్ల మంట

MAA Elections: ‘మా’ ఎన్నికలకు ప్రెస్‌మీట్ల మంట

  • June 26, 2021 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MAA Elections: ‘మా’ ఎన్నికలకు ప్రెస్‌మీట్ల మంట

ఎన్నికలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రాజకీయ నాయకులు, వారి బల ప్రదర్శనలు, ప్రసంగాలు, సమావేశాలు, విమర్శలు. అయితే అవి ఐదేళ్లకొకసారి జరుగుతాయి. కానీ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)లో ఎన్నికలు రెండేళ్లకొకసారి జరుగుతాయి. గత రెండు పర్యాయాలుగా చూస్తే… రాజకీయాలకు, ‘మా’ ఎన్నికలకు పెద్ద తేడా కనిపించడం లేదు. ‘మా’కు రాజకీయం ఆపాదించొద్దు అంటూనే… రాజకీయం చేసేస్తుంటారు. తాజాగా ఈసారి ఎన్నికలు కూడా అలానే తయారయ్యాయి. అందులో తొలి ఘట్టం. ప్రెస్‌ మీట్లు, రెండోది ఆ క్రమంలో చేసే బలప్రదర్శన.

‘మా’ ఎన్నికల్లో ఈ ఏడాది ప్రకాశ్‌ రాజ్‌ అధ్యక్షపదవికి పోటీ చేస్తారని ఏప్రిల్‌లోనే చూచాయగా తేలిపోయింది. ‘వకీల్‌సాబ్‌’ సమయంలో చిరంజీవి కుటుంబాన్ని ఆకాశానికెత్తేస్తుంటే… ‘ఏదో జరుగుతోంది’ అంటూ అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయన ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పేశారు. ఆ తర్వాత ప్యానల్‌ కూడా ప్రకటించేశారు. ఈ క్రమంలో పోటీలో ఇంకెవరు ఉంటారనేది కూడా తేలిపోయింది. విష్ణు, జీవిత రాజశేఖర్‌, హేమ పేర్లు బయటకు వచ్చాయి. అయితే వీరిలో ప్రకాశ్‌రాజ్‌ ప్యానలే అన్ని విషయాల్లోనూ ముందుంది.

ఎన్నికల విషయంలోనే ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ ఎంత ముందు ఉందో చెప్పాలంటే… మొన్న జరిగిన బల ప్రదర్శనే నిదర్శనం. మాకు ఇంత బలం ఉంది అని చూపించడానికే అందరినీ పిలిచి స్టేజ్‌ ఎక్కించి మరీ చూపించారు. నిజానికి ఆ ప్రెస్‌ మీట్‌ అవసరం ఏంటి. ‘మేం ఏ చర్చలోనూ పాల్గొనం, మమ్మల్ని ఏ టీవీ ఛానల్‌ వాళ్లూ పిలవొద్దు’ అని చెప్పడానికి ప్రెస్‌ మీట్‌ అవసరం లేదు. ఏ ట్వీటో, ప్రెస్‌నోట్‌ ఇస్తే సరి. కానీ ప్రకాశ్‌రాజ్‌ అలా చేయలేదు. ఆ కార్యక్రమాన్ని తమ ప్యానల్‌ గురించి చూపిస్తూ, చిరంజీవి సపోర్టు ఉందని చెప్పడానికే పెట్టారు.

అక్కడితో పరిస్థితి ఆగిపోతుందని ఆయన అనుకున్నారేమో. కానీ ప్రెస్‌ మీట్‌ పంచాయితీ అక్కడితో ఆగితే మజా ఏముంటుంది. వెంటనే శనివారం ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ మరో ప్రెస్‌ మీట్‌ పెట్టారు. ఈ క్రమంలో మొన్నటి ప్రెస్‌ మీట్‌లో నాగబాబు మాటలను ఖండించారు. దీంతో టాపిక్‌ మళ్లీ మొదటికొచ్చింది. పనిలోపనిగా జీవిత రాజశేఖర్‌కు తమ సపోర్టు ఉంటుందని చెప్పకనే చెప్పారు.

ఇటీవల కాలం వరకు అధ్యక్షుడు నరేశ్‌కు, కార్యదర్శి జీవితకు పెద్దగా సత్సంబంధాలు లేవనే మాటలు వినిపించేవి. అవి పక్కనపెట్టి మరీ ప్రెస్‌మీట్‌ పెట్టి. కొంతమంది నటీనటుల్ని తీసుకొచ్చి బలప్రదర్శన చేశారు. పనిలోపనిగా తన మీద వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు నరేశ్‌. అయితే రెండేళ్లుగా ‘మా’లో అసమర్థత ఉంది కానీ, ‘మా’ ప్రతిష్ఠ దెబ్బతినలేదు అన్నారాయన. దాని అర్థమేంటో ఆయనకే తెలియాలి.

ఈ వరుస చూస్తుంటే… ఈ క్రమంలో మరో రెండు ప్రెస్‌మీట్లు వచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే మంచు విష్ణు తన ప్యానల్‌ వివరాలు ఇంకా చెప్పలేదు. ఆయన కూడా ఈ విధానంలోనే ప్రెస్‌ మీట్‌ పెడతారు అంటున్నారు. ఇక మిగిలింది హేమ. ఆమె కూడా ఎన్నికల్ని సీరియస్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఓ టీమ్‌తో బరిలోకి వస్తారట. ఒకవేళ ఇదే నిజమైతే ఆమె కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి చెబుతారు. చూస్తుంటే ఈ ప్రెస్‌మీట్లు, బలప్రదర్శనలు ఇంకొంత కాలం నడిచేలా ఉన్నాయి. అయితే అవేమంత ‘మా’కు మంచిది కాదనే విషయం గ్రహించాలి.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema
  • #jeevitha
  • #MAA Elections
  • #manchu vishnu
  • #Movie Artist Association

Also Read

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

related news

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సడన్ బ్రేక్.. ఇది అసలు మ్యాటర్!

Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సడన్ బ్రేక్.. ఇది అసలు మ్యాటర్!

Sree Vishnu: కన్నప్ప’ టీంకి ‘సింగిల్’ సారీ..!

Sree Vishnu: కన్నప్ప’ టీంకి ‘సింగిల్’ సారీ..!

Manchu Vishnu: ఆ 2 డైలాగులపై సీరియస్ అవుతున్న మంచి విష్ణు!

Manchu Vishnu: ఆ 2 డైలాగులపై సీరియస్ అవుతున్న మంచి విష్ణు!

trending news

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

2 hours ago
Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

21 hours ago
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

23 hours ago
థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

1 day ago
సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

1 day ago

latest news

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

18 hours ago
Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

19 hours ago
సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

22 hours ago
Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

23 hours ago
Simran: సిమ్రాన్ క్లారిటీ ఇవ్వలేదు.. ఆ స్టార్ హీరోయిన్ అని డిసైడ్ చేసేస్తున్నారు..!

Simran: సిమ్రాన్ క్లారిటీ ఇవ్వలేదు.. ఆ స్టార్ హీరోయిన్ అని డిసైడ్ చేసేస్తున్నారు..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version