Pawan Kalyan: పవన్‌ గురించి నెటిజన్ల ప్రశ్న.. సమాధానమెక్కడ?

అయితే సినిమా షూటింగ్‌లు, లేదంటే జనసేన కార్యక్రమాలు అంటూ బిజీ బిజీగా ఉంటే పవన్‌ కల్యాణ్‌ గత కొద్ది రోజుల నుండి కనిపించడం లేదు. షూటింగ్‌లకు హాజరవుతున్నట్లు సమాచారమూ లేదు, అలాగే రాజకీయ కార్యక్రమాలూ జరగడం లేదు. దీంతో పవన్‌కి ఏమైంది, ఎందుకు కనిపించడం లేదు అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. సోషల్‌ మీడియాలో ఈ విషయమ్మీద చర్చ నడుస్తోంది. ఇంతకీ పవన్‌కి ఏమైనట్లు. గత కొంతకాలంల పవన్‌ జోడు పడవల ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందే.

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మధ్య మధ్యలో గ్యాప్‌ తీసుకుంటున్నా, ఇంట్లో ఉన్నా ఏదో పని చేస్తూనే ఉన్నారట. ఈ క్రమంలో పవన్‌ ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతోంది అని చెబుతున్నారు. వెన్ను నొప్పి కారణంగా పవన్‌ ఇబ్బంది పడుతున్నారని గత కొన్ని రోజులు నుండి వార్తలొస్తున్నాయి. ఇప్పుడు పవన్‌కి వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని కూడా చెబుతున్నారు. నీరసం, దగ్గు, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్న పవన్‌కు రెస్ట్‌ బాగా అవసరమని వైద్యులు సూచించారట.

దీంతోనే అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పవన్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. ఇదే సమయంలో పవన్‌ తన ఫామ్‌ హౌస్‌ నిర్మాణ పనుల్లో ఉన్నారనే వార్తలూ చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అతని సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ ఆరోగ్యంపై అతని మూవీ రిలేటెడ్‌ పీఆర్‌ టీమ్‌ కానీ, రాజకీయ బృందం నుండి కానీ ఏదైనా సమాచారం ఇస్తే బాగుంటుంది.

నిజానికి ఆగస్టులో పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమాల చిత్రీకరణలు మొదలవుతాయని ఆ మద్య వార్తలొచ్చాయి. ‘హరి హర వీరమల్లు’ పెండింగ్‌ వర్క్‌, ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ పనులు ఈ నెలలో మొదలవుతాయని అన్నారు. అనారోగ్యం కారణంగా అవి వాయిదా పడతాయి. మరోవైపు ఆగస్టు 1 నుండి నిర్మాతల బంద్‌ ప్రకటించడంతో ఆ సినిమాల ఆలస్యం ఎన్ని రోజులు అనేది చెప్పలేని పరిస్థితి. బంద్‌ ఎత్తేసేలోగా పవన్‌ సిద్ధమైతే సినిమాలు ప్రారంభమవుతాయి అని అంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus