స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వడంతో పాటు కొందరు హీరోలకు స్టార్ హీరో స్టేటస్ రావడానికి మరి కొందరు హీరోలకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యారు. జక్కన్న డైరెక్షన్ లో నటించే ఛాన్స్ ను వదులుకోవడానికి ఏ స్టార్ హీరో కూడా ఇష్టపడరు. టాలీవుడ్ స్టార్స్ కు, టాలీవుడ్ సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంలో జక్కన్న పాత్ర ఎంతో ఉంది.
అయితే జక్కన్న డైరెక్షన్ లో నటించి సక్సెస్ సాధించినా తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. స్టూడెంట్ నంబర్ 1లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ నుంచి బాహుబలి2 సినిమాలో నటించిన ప్రభాస్ వరకు అందరు స్టార్ హీరోలు ఈ ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ప్రయత్నించి ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. జక్కన్న ఏదైనా ఇంటర్వ్యూకు హాజరైతే కూడా ఈ ప్రశ్న ఎదురవుతూ రాజమౌళిని ఇబ్బంది పెడుతోంది.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కగా ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటించారు. ఈ హీరోలిద్దరూ వేర్వేరు ప్రాజెక్టులతో కెరీర్ విషయంలో బిజీ అవుతున్నారు. ఈ ఇద్దరు హీరోలలో ఎవరో ఒకరు జక్కన్న ఫ్లాప్ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయకపోతే మాత్రం జక్కన్న డైరెక్షన్ లో నటించే హీరోలు సైతం రాజమౌళి డైరెక్షన్ లో నటించిన తర్వాత ఒక సినిమా ఫ్లాప్ అవుతుందని ఫిక్స్ కావాల్సిందే.
ఒక్కో సినిమాకు అంచనాలకు అందని స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్న జక్కన్నకు సైతం ఈ తరహా సెంటిమెంట్స్ వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు జక్కన్న ఒక్కో సినిమాను మూడు నుంచి నాలుగేళ్ల పాటు తెరకెక్కించడంపై విమర్శలు వస్తున్నాయి. జక్కన్న ఇకనైనా వేగంగా సినిమాలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.