Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి పంపిన కేక్ ని ఎవరు తిన్నారో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి టాస్క్ లో ఒక ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే హౌస్ లోకి ఒక కేక్ ని పంపించి, ఇది తినే అర్హత మీలో ఏ ఒకరికి ఉంది అంటూ దానిపై రాసి పంపించారు. దీంతో హౌస్ మేట్స్ ఈ టాస్క్ ఏంటి అనేది తర్జన భర్జన పడ్డారు. ఇక్కడే అనీమాస్టర్ కెప్టెన్ కాబట్టి, తను కాల్ తీస్కోవాలని హౌస్ మేట్స్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఇక్కడే అర్హత నాకు ఉందంటే, నాకుంది అంటూ హౌస్ మేట్స్ కేక్ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు.

ఆసక్తికరంగా మారిన ఈ కేక్ ని చివరకి ఎవరు తిన్నారు అనేది ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. నైట్ అందరూ పడుకున్నాక సన్నీ ఈకేక్ ని తినేసినట్లుగా సమాచారం. అయితే, తను చాలా స్ట్రాంగ్ గా ఆ కేక్ నేనే తింటాను అంటూ ప్రోమోలో మాట్లాడాడు. అన్నట్లుగానే చివరకి ఈ కేక్ ని సన్నీనే తిన్నాడట. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లో ఈ కేక్ తో పాటుగా బిబి హోటల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో హనీమూన్ కపుల్ గా పింకీ, మానస్ లు ఉన్నారు.

గత కొన్ని సీజన్స్ గా హోటల్ టాస్క్ వస్తూనే ఉంది. అయితే, ఈసారి ఈటాస్క్ చాలా లేట్ గా పెట్టాడు బిగ్ బాస్. ఇందులో మరో సీక్రెట్ టాస్క్ కూడా ఉందని, అది రవి డీల్ చేశాడని సమాచారం తెలుస్తోంది.బిబి హౌటల్ టాస్క్ లో సీక్రెట్ టాస్క్ ఇవ్వడం అనేది కూడా కామన్ గా జరిగేదే. అంతేకాదు, కేక్ తిన్న సన్నీ హోటల్ టాస్క్ లో ఏం అయ్యాడు అనేది కూడా ఆసక్తికరం. కేక్ తినేసి వెయిటర్ అయ్యాడా లేదా ఏదైనా ప్రత్యేకమైన పవర్ వచ్చిందా అనేది ఎపిసోడ్ లో చూడాల్సిందే. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus