నాని వెనక దాక్కున్న హీరోయిన్ ఎవరో తెలుసా..!

నేచరల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి సంబంధించిన నాని లుక్ ని నాని బర్త్ డే సందర్భంగా విడుదల చేసింది చిత్రయూనిట్. రాయల్ స్పెస్ ముందు రొమ్మువిరుచుకుని మరీ నిలబడి ఉన్న ఈ పోస్టర్ లో నాని భగసింగ్ ని తలపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మీసాలు అలాగే మెలితిప్పి ఉన్నాయని నాని లుక్ అద్భుతమని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ కూడా తనదైన స్టైల్లో కామెంట్ చేస్తూ నానికి విషెష్ చెప్పారు.

తలెత్తుకుని గర్వంగా నుంచున్నది నువ్వు మాత్రమే కాదు.. నిన్ను చూసి ప్రతి తెలుగు ప్రేక్షకుడు కూడా అలాగే ఉంటాడు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అంతేకాదు, యాష్ ట్యాగ్ ని కలిపి శ్యామ్ సింగరాయ్ అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పోస్టర్ లో వెనకనుంచి నానిని గట్టిగా హత్తుకుని ఉన్న ఆ అమ్మాయి ఎవరూ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్స్ గా సాయిపల్లవితో పాటుగా, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కూడా నటిస్తోంది. మరి వీరిద్దరిలో ఈ అమ్మడు ఎవరు అనేది నెటిజన్స్ చాలా ఇంట్రస్ట్ గా సెర్చ్ చేస్తున్నారు.

కోల్ కత్తా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్న సంగతి తెలిసిందే. అంటే హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటే ఖచ్చితంగా సెకండ్ హీరోయిన్ ఉంటుంది కాబట్టి ఈ పోస్టర్ లో వెనక ఉన్నది కృతిశెట్టినే నో డౌట్ అని చెప్తున్నారు అందరూ. పోస్టర్ చూసినవాళ్లలో మెజారిటీ ఆడియన్స్ అందరూ కృతిశెట్టి అనే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అదీ విషయం.


Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus