నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హ్యాట్రిక్ విజయాల జోరు కొనసాగిస్తూ, నెక్స్ట్ 109వ చిత్రం డాకు మహారాజ్ తో రెడీగా ఉన్నారు. అఖండ(Akhanda) , వీరసింహారెడ్డి(Veera Simha Reddy), భగవంత్ కేసరి (Bhagavath Kesari) వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలతో బాలయ్య తన మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు దర్శకుడు బాబి(Bobby) తో కలసి పనిచేస్తున్న ఈ చిత్రం మరో పెద్ద హిట్ గా నిలవబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కంటెంట్ కు బాబి మార్క్ మాస్ ఎంటర్టైనర్ టచ్ ఉండటం ప్రత్యేక ఆకర్షణ.
నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) బాలకృష్ణ వీరాభిమాని కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత నమ్మకం పెరిగింది. సినిమాలో బాలయ్య పాత్రకి తగిన విధంగా అన్ని అంశాలు అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం. పండగ సీజన్ లో ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. డాకు మహారాజ్ (Daaku Maharaaj) ట్రైలర్ జనవరిలో రిలీజ్ చేసి థియేటర్లలో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించాలని భావిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఒక స్టార్ గెస్ట్ ను తీసుకురావాలని చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది. బాలయ్యతో వేదిక పంచుకునేందుకు మహేష్ బాబు (Mahesh Babu) లేదా ప్రభాస్ (Prabhas) వంటి పాన్ ఇండియా హీరోలలో ఒకరిని ఆహ్వానించవచ్చనే టాక్ నడుస్తోంది. వీరిలో ఒకరు హాజరైతే, ఈ ఈవెంట్ మరింత గ్రాండ్ గా జరగడం ఖాయం. బాలకృష్ణకు టాలీవుడ్ హీరోలందరితో మంచి సంబంధాలు ఉండటంతో, ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఈవెంట్‌తో సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తారు. అంతేకాదు, డాకు మహారాజ్ (Daaku Maharaaj) చిత్రంలో బాలయ్య పాత్ర మాస్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అభిమానుల కోసం మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా చిత్రానికి మరింత క్రేజ్ తీసుకురావాలని భావిస్తున్నారు.