Nani: నాని కొత్త సినిమా.. హీరోయిన్‌ ఎవరు? ప్రచారంలోకి మరో కపూర్‌ భామ!

నాని (Nani) – శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ సినిమా సాధించిన విజయం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పొచ్చు. నానిలోని మాస్‌ హీరోను పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చిన సినిమా అది. ఇప్పుడు ఆ సినిమా కాంబినేషన్‌లో మరో సినిమా రెడీ చేయడానికి టీమ్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఇచ్చేసింది. త్వరలో సినిమా షూటింగ్‌ ప్రారంభం అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయట.

Nani

అలా హీరోయిన్‌ దగ్గరకు వచ్చినప్పుడు చర్చ ఆగింది అని చెబుతున్నారు. ‘అదేంటి జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్‌ అయ్యారు కదా’ అని మీరు గతంలో చదివిన వార్తను గుర్తు చేసుకోవచ్చు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే కపూర్‌ గర్ల్‌ ఫిక్స్‌ కానీ.. ఏ కపూర్‌ అనేది తెలియదు అని చెబుతున్నారు. అంటే జాన్వీ కపూర్‌తోపాటు శ్రద్ధా కపూర్‌ పేరును కూడా పరిశీలిస్తున్నారట. త్వరలోనే క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు.

సికింద్రాబాద్‌ నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్‌ కథతో నాని – శ్రీకాంత్‌ ఈ సారి రాబోతున్నారు. ‘దసరా’ సినిమాతో పోలిస్తే వంద రెట్లు హై ఉండే కథ ఇది అని చెబుతున్నారు. ‘దసరా’ స్థాయిలోనే ఇందులో కూడా హీరోయిన్‌ పాత్ర కీలకంగా ఉంటుందని అందుకే హీరోయిన్‌ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నాయికతో పాటు ఇతర నటులను కూడా తీసుకుంటారనే మరో చర్చ కూడా సాగుతోంది.

అలాగే సౌత్‌ నుండి మరికొంతమంది పరభాషా నటులను తీసుకుంటారు అని చెబుతున్నారు. ప్రస్తుతం నాని ‘హిట్‌ 3’ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పనులు ఓ కొలిక్కి వచ్చాక.. శ్రీకాంత్‌ ఓదెల సినిమా మొదలవుతుంది అని సమాచారం. ఈ లోపు హీరోయిన్‌ను ఫిక్స్‌ చేసేస్తారు అని సమాచారం. చూద్దాం ఏ కపూర్‌ గర్ల్‌ ఓకే అవుతుందో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus