Waltair Veerayya: విలన్‌ చప్పగా ఉంటే.. సినిమా కూడా చప్పనే కదా..!

విలన్‌ ఎంత బలంగా ఉంటే.. హీరో అంత బలంగా ఉంటాడు. ఈ మాట మేం చెప్పడం కాదు.. చాలా సినిమాలు చూసిన తర్వాత జనాలూ ఉన్నారు. సీనియర్‌ దర్శకులు, నటులు కూడా అన్నారు. అంటే పోటాపోటీగా ఫైట్‌ చేసే విలన్‌ లేకపోతే హీరో పాత్ర పండదు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. అలాంటి విలన్‌ను సినిమాలో తీసుకొని, అతనెవరో చెప్పకపోతే అది ఇంకా కష్టం. గతంలో కొన్ని సినిమాల విషయంలో ఇలాంటి ఇబ్బంది చూశాం. తాజాగా చిరంజీవి అభిమానులు కూడా ఇదే అంటున్నారు.

చిరంజీవి అభిమానుల లేటెస్ట్‌ ప్రశ్నల్లో ఒకటి ‘వాల్తేరు వీరయ్య’ డేట్‌ ఎప్పుడు అయితే, రెండో ప్రశ్న ‘ఈ సినిమాలో విలన్‌ ఎవరు?’. ఎందుకంటే సినిమాలో చిరంజీవి ఆపోజిట్‌గా నిలబడతే ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే.. సినిమాలో ఎలాంటి సీన్స్‌ ఉంటాయి అనేది ఓ అంచనా వేసుకోవచ్చు అని. అయితే, ఈ విషయంలో ‘వాల్తేరు వీరయ్య’ టీమ్‌ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో సినిమాలో విలన్‌ ఎవరు వీరయ్యా? అని అడుగుతున్నారు. దీనికీ ఓ కారణం ఉంది.

చిరంజీవి రీసెంట్‌ ఫ్లాప్‌ ‘ఆచార్య’ సినిమాలో విలన్‌ ఎవరు అనే విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. తొలి రోజుల్లో సోనూ సూద్‌ని విలన్‌ అని చెప్పినా.. ఎక్కడా సరిగ్గా ప్రొజెక్ట్‌ చేయలేదు. దీంతో చిన్న కన్‌ఫ్యూజ్‌ వచ్చి పడింది. అయితే చిరంజీవితో వచ్చే సంక్రాంతికి పోటీకి దిగుతున్న బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ విషయంలో విలన్‌ ఎవరు అనేది ముందే చెప్పేశారు. దునియా విజయ్‌ ఈ సినిమాలో విలన్‌ అని ఎప్పుడో అనౌన్స్‌ చేసేశారు.

దీంతో విలన్‌ విషయంలో ‘వాల్తేరు వీరయ్య’ వెనుకబడ్డాడు అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అసలు ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి లీక్‌లు కూడా లేవు. టీజర్‌, ట్రైలర్‌లో అయినా ఏమైనా చూపిస్తారేమో చూడాలి. థ్రిల్లర్‌ సినిమాల్లో, సైకో సినిమాల్లో అయితే విలన్‌ను చూపించకపోతే ఓకే.. కానీ మాస్‌, యాక్షన్‌ సినిమాలో చూపించకపోతే ఎలా?

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus