వెంకటేష్ (Venkatesh) హీరోగా, ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్స్‌గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమా సంక్రాంతి పండక్కు రాబోతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పరచుకుంది. తాజాగా ఈ సినిమాలో ఉండబోయే సర్ ప్రైజ్ పై ఆసక్తికరమైన టాక్ మొదలైంది. సినిమాలో ఒక యంగ్ హీరో క్లైమాక్స్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆ హీరో చుట్టూ కామెడీ అల్లుకున్నట్లుగా యూనిట్ సభ్యులు చెప్పడం ఆసక్తికరంగా మారింది.
అయితే ఆ హీరో ఎవరో ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంచారు. సినిమాకు దగ్గరపడే కాలంలో ఈ విషయాన్ని రివీల్ చేస్తారా లేదా విడుదల అయ్యేంత వరకు సస్పెన్స్‌గా ఉంచుతారా అనేది వేచి చూడాలి. మరోవైపు, ఈ చిత్రం ప్రోమోషన్ కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి. ఇటీవల విడుదలైన గోదారి గట్టు పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్తగా ఒక ఫెస్టివ్ సాంగ్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వెంకటేష్‌ను వింటేజ్ స్టైల్లో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో పాటు, వెంకటేష్ పాత్రలో ఉన్న ఎమోషనల్ డెప్త్ కథను మరింత బలంగా నిలబెడుతుందని సమాచారం. ఈ సినిమాలో వెంకటేష్ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అతని భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఉండగా, ప్రియురాలి పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు.
ఈ యూనిక్ సెట్‌ప్ సినిమా కథనానికి కొత్త కోణం తీసుకొస్తుందని అంటున్నారు. యంగ్ హీరో ప్రత్యేక పాత్ర వల్ల ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంక్రాంతి సీజన్ సినిమాల పోటీ తీవ్రంగా ఉండబోతోంది. రామ్ చరణ్(Ram Charan), శంకర్ (Shankar) గేమ్ ఛేంజర్ (Game Changer) , బాలకృష్ణ (Nandamuri Balakrishna) డాకు మహారాజ్ (Daaku Maharaaj) సినిమాల మధ్య ‘సంక్రాంతికి వస్తున్నాం’ తనదైన మార్క్ వేయాలని టార్గెట్ సెట్ చేసుకుంది.