మార్చి నెలాఖరుకి వచ్చేశాం. ఉగాది, రంజాన్ పండుగల సెలవులతో ఈ నెలకి గుడ్ బై చెప్పే టైం వచ్చింది.ఇక పండుగ రోజుల్లో ఎంటర్టైన్ చేయడానికి 4 సినిమాలు (Movies) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవే మోహన్ లాల్ (Mohanlal) – పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ..ల ‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2: Empuraan) , విక్రమ్ (Vikram) ‘వీర ధీర శూర'(Veera Dheera Soora) , నితిన్ (Nithiin) ‘రాబిన్ హుడ్’ (Robinhood), ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారి ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square). మార్చి 27న ‘ఎల్ 2 : ఎంపురాన్’ ‘వీర ధీర శూర’ రిలీజ్ అయ్యాయి. ఈరోజు అంటే మార్చి 28న ‘రాబిన్ హుడ్’ ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ అయ్యాయి. సో మొత్తం 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. వాటికి మీడియా వారి జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. వారి దృష్టిలో కంటెంట్ పరంగా ఉగాది విన్నర్ అయ్యే ఛాన్స్ దేనికి ఉందో చెప్పేశారు. వారి అనాలిసిస్ ప్రకారం..
‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ఈ సమ్మర్ కి ఎక్కువ నవ్వులు పంచే సినిమా అవుతుంది అని తీర్మానించారు. యూత్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయ్యే సినిమా ఇదే అని కూడా అంటున్నారు.
ఇక విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ కంటెంట్ పరంగా కచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుందట. కచ్చితంగా ఒకసారి థియేటర్లలో చూడదగ్గ సినిమా ఇది అంటున్నారు.
ఇక నితిన్ (Nithiin) నటించిన ‘రాబిన్ హుడ్’ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయినప్పటికీ కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఒకసారి థియేటర్లలో చూసే విధంగా ఈ సినిమా ఉంది అంటున్నారు.
ఇక చివరి ప్లేస్లో మోహన్ లాల్ ‘ఎల్ 2 : ఎంపురాన్’ ఉంది. దీనికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇది కేరళ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకోలేదు. తెలుగులో చాలా స్క్రీన్స్ ‘మ్యాడ్ స్క్వేర్’ తో రీప్లేస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సో ఇది క్రిటిక్స్, ట్రేడ్ పండితుల నుండి వచ్చిన రిపోర్ట్. మరి ప్రేక్షకుల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూడాలి..!