Hansika: హన్సికకు కాబోయే భర్త గురించి ఈ విషయాలు తెలుసా?

సినీనటి హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి హన్సిక సైతం అధికారికంగా వెల్లడించారు. ఈమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే విషయం చెప్పకపోయినా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఈ జంట పారిస్ లోని ఈఫిల్ టవర్ దగ్గర దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తను చేసుకోబోయే వ్యక్తిని పరిచయం చేశారు.

ఐ లవ్ యు సో హెల్..ఐ యాం ఫరెవర్ అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తన చేసుకోబోయే వ్యక్తిని పరిచయం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతో మంది నెటిజన్లు హన్సిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు?అతని బ్యాగ్రౌండ్ ఏంటి అతను కూడా ఇండస్ట్రీకి చెందిన వారేనా అంటూ పెద్ద ఎత్తున అతని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే హన్సిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు సోహైల్ కథురియా.

ఈయన ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఈయన ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని తెలుస్తోంది.ఇక ఈయనకు హన్సికతో చిన్నప్పటి నుంచి మంచి స్నేహం ఉండడం చేత తన హన్సిక బిజినెస్ పార్టనర్ గా చేసుకున్నారు.ఇలా వీరిద్ధరు కలిసి బిజినెస్ చేయడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఇక వీరిద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులకు కూడా ఒప్పుకోవడంతో డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహాన్ని జైపూర్ లోని ఒక పురాతన పాలెస్ లో ఎంతో ఘనంగా జరగనుందని తెలుస్తుంది.ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన అన్ని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.త్వరలోనే ఈమె పెళ్లి గురించి కూడా అధికారకంగా తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.

1

2

3

4

5

More…

1

2

3

4

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus