సంక్రాంతి అంటేనే సరదా. ఆ సరదాకి సినిమా జోడైతే మజా. ఆ మజాకి హిట్ సిినిమా చూస్తే కిక్. ఆ కిక్ ని ఎవ్వరూ ఈ సంవత్సరం మిస్ అయ్యేలాగా లేరనే అనిపిస్తోంది. ఎందుకంటే, ఈసారి సంక్రాంతికి బరిలోకి దిగే నాలుగు సినిమాల్లో ఏ ఒక్కటీ తీసిపారేసే సినిమా అయితే లేదు. మరి వీళ్లలో హిట్ కొట్టేదెవరు అనేది మనం ఒక్కసారి చూసిటనట్లయితే.., ఫస్ట్ జనవరి 9వ తేదిన వస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి మంచి మార్కెట్ ని కొల్లగొట్టాడు. ప్రీరిలీజ్ బిజినెస్ తోనే సినిమాని సేఫ్ చేసుకున్నాడు. వంద పర్సెంట్ థియేటర్ ఆక్యూపెన్సీ ఉన్నా లేకున్నా కూడా సినిమా మినిమమ్ గ్యారెంటీగా పాస్ అయిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే, మీసం తిప్పూతూ మరోసారి విక్రమ్ రాథోడ్ ని గుర్తుచేస్తూ ఫ్యాన్స్ కి మంచి జోష్ అందించాడు. అందుకే ఈసినిమాకి ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు, ఈసినిమాకి ఇంకా వచ్చే సినిమాలకి గ్యాప్ ఉండటం కూడా కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
ఇక ఆ తర్వాత జనవరి 13న వస్తున్న మాస్టర్ సినిమా కూడా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే సినిమాలాగానే కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే పక్కా యూత్ కి ఎక్కేలాగా ఉంది. అందులోనూ ఇద్దరు విజయ్ ల యాక్షన్ సీన్స్ పీక్స్ లో ఉంటాయని ట్రైలర్ లోనే చెప్పాడు డైరెక్టర్. ఖైదీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పుడు ఈసినిమాతో మరో హిట్ కొట్టి తెలుగు ఇండస్ట్రీని కూడా తనవైపు తిప్పుకునేలా ఉన్నాడు. ఈ సినిమా కూడా మంచి హిట్ కొట్టి తెలుగులో విజయ్ కి హైఎస్ట్ కలక్షన్స్ ఇస్తుందనే అనిపిస్తోంది.
నెక్ట్స్ రామ్ నటించిన రెడ్ సినిమా ట్రైలర్ లోనే మాస్ కి మంచి కిక్ ఇచ్చాడు. డబుల్ యాక్షన్ చేస్తూ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. సంక్రాంతికి జనవరి 14వ తేదిన విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా రెండు తెలుగురాష్ట్రాల్లో దుమ్మురేపిందనే చెప్పాలి. ఈ లెక్కన ఈసినిమా మూడు రోజులు హౌస్ ఫుల్ కలక్షన్స్ తో ఆడినా లాభాలబాట పడుతుందనే లెక్కలు వేస్తున్నారు సినీ పండితులు. అంతేకాదు, రీసంట్ గా రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టడంతో ఈ సినిమాకి కూడా భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఆ తర్వాత సంక్రాంతి పండగని టార్గెట్ చేస్తూ జనవరి 15వ తేదిన అల్లుడు అదుర్స్ అంటూ బెల్లెంకొండ సాయి శ్రీనివాస్ వస్తున్నాడు. ఈ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, బెల్లంకొండ శ్రీనివాస్ గతంలో రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టి మంచి మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు. ఇంకా ఈ సినిమా పక్కా మాస్ మసాలా యాక్షన్ తో ఉండటం అనేది కలిసొచ్చే అంశం. మొత్తానికి నాలుగు సినిమాలు కూడా ఈసారి మంచి కలక్షన్స్ రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా కరోనా లాక్డౌన్ లో విసిగిపోయిన ప్రజలు పండక్కి థియేటర్ కి వచ్చి రీఫ్రెష్ అవ్వాలనే చూస్తున్నారు. ప్రతి చోటా తగిన జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్స్ ఈసారి హౌస్ ఫుల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వంద శాతం ఆక్యూపెన్సీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఈ నాలుగు సినిమాలు మంచి కలక్షన్స్ ని సాధిస్తాయి.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!