Vaishnav Tej: శిష్యుల కోసం సుకుమార్‌ ప్లానింగ్‌ సూపర్‌ కదా!

మొదటి సినిమా విడుదలైంది… రెండో సినిమా రెడీ అయ్యింది కానీ, ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో తెలియదు, మూడో సినిమా మొదలైంది కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు షూటింగ్‌ మొదలవుతుందో తెలియదు. కానీ నాలుగు, ఐదు సినిమాలు ఓకే అయిపోయాయి అంటున్నారు. ఆ హీరో ఎవరో మీకు అర్థమైపోయుంటుంది. ఇంకా లేదు అంటే మన మెగా కుటుంబం కొత్త వారసుడు వైష్ణవ్‌ తేజ్‌ గురించే ఇదంతా. వైష్ణవ్‌ నెక్స్ట్‌ సినిమాలపై ఇంట్రెస్టింగ్ రూమర్‌ ఒకటి నడుస్తోంది. దాని ప్రకారం చూస్తే వైష్ణవ్‌కు పారితోషికం కూడా గట్టిగానే అందబోతోంది.

వైష్ణవ్‌ తేజ్‌తో తొలి సినిమా ‘ఉప్పెన’ చేసిన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌… మరో రెండు సినిమాల కోసం ఓకే చేయించుకున్నారట. అంతేకాదు ఈ రెండు సినిమాల కోసం ఏకంగా ₹10 కోట్లు ఇస్తున్నారని టాక్‌. ఈ సినిమాలకు సుకుమార్‌ సహ నిర్మతగా వ్యవహరిస్తాడని కూడా చెబుతున్నారు. సుకుమార్‌ శిష్య బృందం నుండి ఇద్దరు దర్శకులు ఈ సినిమాలకు దర్శకత్వం వహిస్తారని భోగట్టా. వాటికి కథా సహకారం తదితర సహకారాలు సుకుమార్ ఎలాగూ ఇస్తాడనుకోండి.

సుకుమార్‌ ఈ డీల్‌ని వైష్ణవ్‌ కోసం చేశాడా, లేక తన శిష్యుల కోసం చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఎవరి కోసం చేసినా మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్ల పంట అయితే పండబోతోంది. ఎందుకంటే సుక్కు శిష్యుల సినిమా అంటే మినిమమ్‌ గ్యారెంటీ అని ‘కుమారి 21 ఎఫ్‌, ’‘ఉప్పెన’ నిరూపించాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఆ శిష్య దర్శకులు కూడా అదే స్థాయిలో ఇంట్రెస్టింగ్‌ సినిమాలు తెరకెక్కిస్తారని కొత్తగా చెప్పాలా.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus