Allu Aravind: ‘బలగం’ విజయం అరవింద్‌కి ఆనందం ఇవ్వలేదా? కారణమదేనా?

సినిమా విజయం సాధిస్తే.. ఇండస్ట్రీలో ఆనందించేవాళ్లు చాలామంది ఉంటారు. అది వారి సినిమా అయినా, ఇతరుల సినిమా అయినా ఈ ఆనందాన్ని ఆస్వాదించేవాళ్లు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారిలో ఏస్‌ ప్రొడ్యూస్‌ అల్లు అరవింద్‌ ఒకరు. చిన్న సినిమాలు విజయాలు సాధిస్తే.. ఆయన మెచ్చుకుంటూ ఉంటారు. పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు తీసినా ఆయన తనదైన శైలిలో మెచ్చుకుంటారు. ఆ నిర్మాత, దర్శకుడు, నటులకు ఆయన అభినందనలు తెలుపుతూ ఉంటారు. అయితే ఆయన ‘బలగం’ సినిమా టీమ్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదు.

ఇప్పుడు టాలీవుడ్‌లో సోషల్‌ మీడియాలో, సినిమా వర్గాల్లో దీని గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల టాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘కార్తికేయ 2’ సినిమా టీమ్‌ను  అల్లు అరవింద్‌ ముందుకొచ్చి మెచ్చుకున్నారు. అలాంటిది తనకు ఎంతో సన్నిహితుడు అయిన దిల్‌ రాజు నిర్మాణంలో వచ్చిన సినిమా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు అనేదే ప్రశ్న. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలు విజయాలు సాధిస్తే బన్నీ కూడా పార్టీలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు అది కూడా జరగలేదు. దీంతో ఏం జరిగింది అనే చర్చ నడుస్తోంది.

గతంలో దిల్‌ రాజు నిర్మాణంలో వచ్చిన ‘శతమానం భవతి’ సినిమాకు, వైజయంతీ మూవీస్‌ తీసిన ‘మహానటి’ సినిమాల రిలీజ్ తర్వాత టీం అందరినీ పిలిచి పార్టీ ఏర్పాటు చేసి ప్రశంసలు కురిపించారు అల్లు అరవింద్. ఇప్పుడు దిల్ రాజు నుండి ‘బలగం’ రావడం, మంచి విజయం అందుకోవడం జరిగిపోయాయి. చిరంజీవి, మోహన్‌బాబు కూడా అభినందనలు తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ అవార్డులు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అల్లు అరవింద్‌  నుండి ఎలాంటి స్పందన లేదు. అయితే దీనికి, ఇటీవల దిల్‌ రాజు అనౌన్స్‌ చేసిన ప్రాజెక్ట్‌కి సంబంధం ఉంది అంటున్నారు.

విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో దిల్ రాజు ఇటీవల ఓ సినిమా అనౌన్స్ చేశారు. ‘గీత గోవిందం 2’ అని పేరు కూడా బయటకు వచ్చింది. అయితే ‘గీత గోవిందం’ సినిమా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో వచ్చింది. దీంతో కొత్త సినిమా విషయంలో అల్లు అరవింద్ బాగా ఫీలయ్యారని టాక్‌. ఈ విషయంలో ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ మాట్లాడుదాం అనుకున్నారట. కానీ ఎందుకో ఆగిపోయారు. ఇప్పుడు ఆ దూరమే ‘బలగం’ విజయాన్ని చూడకుండా చేసింది అంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus