మొన్నీమధ్య ‘అన్‌స్టాపబుల్’ షోకి రామ్‌చరణ్(Ram Charan) వచ్చినప్పుడు ఓ మాట చెప్పాడు గుర్తుందా? చిరంజీవి (Chiranjeevi), నాగబాబు (Naga Babu) , పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫొటో చూపిస్తూ వీరిలో ఎవరితో సరదా టైమ్ గడపాలి అని అనుకుంటున్నావు అని బాలకృష్ణ(Nandamuri Balakrishna) అడిగితే.. వీళ్లు ముగ్గురూ కాదు మావయ్య అల్లు అరవింద్‌తో అని చెప్పాడు చరణ్. అంత మంచి అనుబంధం ఉంది రామ్‌చరణ్ – అల్లు అరవింద్ మధ్య. వాళ్లిద్దరి మధ్యే కాదు చిరంజీవి – అరవింద్ (Allu Aravind) మధ్య కూడా అంతే మంచి రిలేషన్ ఉంది.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే అంత మంచి రిలేషన్ ఉన్న అల్లు అరవింద్ రీసెంట్‌గా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, చేతలు చూస్తుంటే ‘ఎందుకిలా చేస్తున్నారు అరవింద్‌గారూ?’ అని అనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి మొన్నామధ్య ‘తండేల్’ (Thandel) ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పైకీ కిందకీ చేతులు చూపిస్తూ దిల్ రాజు (Dil Raju) సంక్రాంతి సినిమాల గురించి యాక్ట్ చేస్తూ మరీ వివరించారు. అందులో వివరణ కాకుండా వెక్కిరింపు ఉంది అని మెగా ఫ్యాన్స్ బాధపడ్డారు.
ఆ తర్వాత ‘చిరుత’ (Chirutha) సినిమా సాధించిన ఫలితం గురించి అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ‘చిరుత’ సినిమా సరైన విజయం సాధించలేదని, అందుకే ‘మగధీర’(Magadheera) సినిమా తీసి మేనల్లుడుకు మంచి హిట్ ఇచ్చే ప్రయత్నం చేశానని చెప్పారు అరవింద్. అయితే 2007లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో రూ.25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది. దీంతో అల్లు అరవింద్ మాటల విషయంలో ఎందుకిలా చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు.
మేనల్లుడి సినిమాల గురించి తక్కువ చేస్తే ఏం వస్తుంది అనేది మరో డిస్కషన్. ఇక ఇక్కడ మరో టాపిక్ ఏంటంటే.. ప్రస్తుతం అల్లు అరవింద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అన్నీ అనుకున్నట్లుగా పనులు జరుగుతున్నాయి. పెద్ద సినిమా, భారీ సినిమా కాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి టికెట్ రేట్ల పెంపు లాంటివి బెనిఫిట్‌లు పొందారు. ప్రభుత్వం నుండే కానీ అది మెగా ఫ్యామిలీ సాయంతోనే అని నెటిజన్లు అంటున్నారు. ఇలా ఓ చేత్తో మెగా ఫ్యామిలీ కారణంగా లాభాలు పొందుతూ, మరోవైపు అదే కుటుంబానికి చెందిన హీరో గురించి, అందులోనూ మేనల్లుడు సినిమాల గురించి ఎందుకిలా మాట్లాడుతున్నారు అనేది ఆయనకే తెలియాలి.