Balayya Babu: స్టార్ హీరో బాలకృష్ణ మల్టీస్టారర్లకు దూరమా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ సోలో హీరోగానే కెరీర్ ను కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు మల్టీస్టారర్లపై దృష్టి పెడుతుండగా బాలయ్య మాత్రం మల్టీస్టారర్లకు దూరంగా ఉంటున్నారు. గతంలో బాలయ్య ఒకటీ రెండు మల్టీస్టారర్స్ లో నటించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. మల్టీస్టారర్స్ లో నటించడం వల్ల సినిమా సక్సెస్ సాధించినా మెయిన్ హీరోకు పూర్తిస్థాయిలో క్రెడిట్ దక్కదు.

ఈ రీజన్ వల్లే బాలయ్య మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా మరీ అద్భుతమైన కథ ఉంటే మాత్రమే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి బాలకృష్ణ ఆసక్తి చూపించే ఛాన్స్ ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య సోలో హీరోగానే వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. స్టార్ స్టేటస్ అందుకునే టాలెంట్ ఉన్న దర్శకుల డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్నారు. అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను,

పరశురామ్ డైరెక్షన్ లో బాలయ్య తర్వాత సినిమాలు తెరకెక్కుతుండగా ఈ సినిమాలన్నీ మంచి అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. 110 కోట్ల రూపాయల బడ్జెట్ తో వీరసింహారెడ్డి తెరకెక్కగా ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లోనే జరుగుతోంది. బాలయ్య నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆశిస్తారో అలాంటి సినిమాల్లోనే బాలయ్య నటిస్తూ యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బాలయ్య శృతి హాసన్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ నెల 15వ తేదీన ఈ సినిమా నుంచి సుగుణసుందరి సాంగ్ రిలీజ్ కానుంది. బాలయ్య అనిల్ కాంబో మూవీ షూట్ మొదలు కాగా ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించి త్వరలో స్పష్టత రానుంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus