DVV Danayya: ‘ఆర్‌ఆర్ఆర్‌’ అవార్డుల్లో నిర్మాతకు ఎలాంటి సంబంధం లేదా?

సినిమా టైటిల్‌ కార్డ్స్‌లో నిర్మాత పేరు చివర్లో ఎప్పుడో పడుతుంది. దీంతో కొంతమంది డబ్బులు పెట్టే నిర్మాత ఎప్పుడూ లాస్ట్‌లో రావాల్సిందేనా? అని జోక్‌ కూడా చేస్తుంటారు. సినిమాకు నటులు ఎంత ముఖ్యమో… వాళ్లకు డబ్బులు ఇచ్చే నిర్మాత కూడా అంతే ముఖ్యం. ఇప్పుడెందుకు నిర్మాత గురించి ఇంత వివరంగా చెబుతున్నాం అనుకుంటున్నారా? దేశం గర్వించదగ్గ మూమెంట్‌ను అందుకున్న ఓ సినిమా గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరూ ఆ సినిమాకు పని చేసినవాళ్లను ట్వీట్లలో మెచ్చుకుంటున్నారు. అయితే ఆ మెచ్చుకోలు పొందుతున్నవాళ్లలో నిర్మాత లేకపోవడం విడ్డూరం.

మేం చెప్పేది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించే అనే విషయం మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట ఆస్కార్‌ పురస్కారం కోసం నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా ఈ సినిమాకు చాలా అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. దాంతో ఎంతోమంది పెద్దలు, పిన్నలు, సెలబ్రిటీలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. వాటిలో ఎక్కడా నిర్మాత పేరు కనిపించకపోవడం గమనార్హం. ఆఖరికి సినిమాకు పని చేసినవాళ్లు కూడా నిర్మాత పేరును ఎక్కడా ప్రస్తావించడం లేదు.

‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్‌ అయినప్పుడు చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి చేసిన ట్వీట్‌లో చాలామందిని ప్రశంసించారు. తన టార్చర్‌ భరించిన తారక్‌, రామ్‌చరణ్‌ను మళ్లీ టార్చర్‌ చేస్తా అంటూ నవ్వుతూ చెప్పారు. అయితే అసలు ఈ సినిమా సాకారం అవ్వడానికి డబ్బులు ఖర్చు పెట్టిన నిర్మాత ప్రస్తావన లేదు. ఇప్పుడే కాదు చాలా రోజులుగా సినిమా గురించి ఎక్కడెక్కడో మాట్లాడుతున్నా డీవీవీ దానయ్య అనే పదం ఎక్కడా వినిపించడం లేదు. దీంతో అసలు ఎందుకు దానయ్య వీళ్లకు గుర్తుకు రావడం లేదు అంటూ ఓవైపు చర్చ జరుగుతోంది.

‘బాహుబలి’ విషయంలోనూ ఇలానే జరిగి ఉంటే.. రాజమౌళి స్టైల్‌ ఇదే అనే మాట చెప్పొచ్చు. ఆ సినిమా ప్రచారం, పురస్కారాలు ఇలా అన్నింటికీ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ హాజరయ్యారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో ఎందుకు జరగడం లేదు అనేదే ఇక్కడ ప్రశ్న. సమాధానం ఎవరిస్తారో చూడాలి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus