కీరవాణి స్పీచ్ టైంలో ఎన్టీఆర్ ఫోటోనే ఎందుకు స్క్రోల్ చేశారు..చరణ్ విషయంలో ఎందుకిలా?

మొత్తానికి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి ఆస్కార్ లభించింది.దీంతో చిత్రబృందంతో పాటు ఇండియా మొత్తం ఈరోజు పండగ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డు లభించింది.రిహానా వంటి హాలీవుడ్ పాపులర్ సింగ‌ర్స్ పాడిన పాట‌లు పోటీలో ఉన్నప్పటికీ వాట‌న్నింటినీ వెనక్కి నెట్టి మరీ ‘నాటు నాటు’ ఆస్కార్ గెలవడం విశేషంగా చెప్పుకోవాలి.

ఈ పాటకు ఎం.ఎం కీరవాణి బాణీలు అందించగా అతని తనయుడు కాలభైరవ అలాగే బిగ్ బాస్3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఈ పాటని ఎంతో హుషారెత్తించే విధంగా ఆలపించారు.చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ అందించారు. రాంచరణ్ – ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఆస్కార్ గెలిచిందన్న వార్త బయటకు వచ్చిన వెంటనే చరణ్, ఎన్టీఆర్ ట్విట్టర్లో తమ ఆనందాన్ని పంచుకుంటూ ట్వీట్స్ వేశారు.

ఇందులో ఎన్టీఆర్ ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే అతను రాంచరణ్ పేరును ట్యాగ్ చేయలేదు.ఆస్కార్ గురించి అతను రెండు ట్వీట్లు వేయగా.. రెండిటిలో కూడా చరణ్ పేరును ప్రస్తావించలేదు. కానీ చరణ్ మాత్రం ఎన్టీఆర్ ను ట్యాగ్ చేశాడు. గత వారం, పది రోజులుగా విదేశాల్లో ఉన్న రాంచరణ్.. తాను ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా తారక్ గురించి గొప్పగా చెబుతున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం పలుమార్లు చరణ్ పేరును స్కిప్ చేయడం జరిగింది.

అంతే కాకుండా సంగీత దర్శకుడు కీరవాణి .. ఆస్కార్ అవార్డుల వేదిక పై స్పీచ్ ఇస్తున్న టైంలో వెనుక ఎన్టీఆర్ ఫోటోను చూపించారు. కానీ చరణ్ ఫోటో అక్కడ కనిపించలేదు. ఇలాంటి విషయాలు చరణ్ అభిమానులను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి అని చెప్పొచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే అభిమానుల మధ్య చిచ్చు పెట్టడానికి కారణమయ్యే ప్రమాదాలు కూడా లేకపోలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus