ఆచార్య సినిమా విడుదలైన తర్వాత ఆచార్య మూవీలో కాజల్ యాక్ట్ చేసి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాజల్ పాత్రను కొంత భాగం షూట్ చేసిన తర్వాత ఈ సినిమా నుంచి తొలగించడం జరిగింది. సినిమాలో కాజల్ లేదని తెలిసి కాజల్ అభిమానులు కూడా తెగ ఫీలయ్యారు. అయితే ఆచార్యలో రోల్ మిస్సైనా కాజల్ ఏ మాత్రం ఫీల్ కావడం లేదని సమాచారం అందుతోంది. కాజల్ కు ఆచార్యకు సంబంధించి ఫుల్ రెమ్యునరేషన్ అందిందని తెలుస్తోంది.
ఆచార్య మూవీ కొరకు కాజల్ కు కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ దక్కినట్టు తెలుస్తోంది. జోడీ లేకుండా మెగాస్టార్ ఆచార్య మూవీలో నటించడం గమనార్హం. అనుష్క ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కొన్నిరోజుల క్రితం కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మగబిడ్డకు నీల్ కిచ్లు అనే పేరును ఫిక్స్ చేశారు. కాజల్ భవిష్యత్తులో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారా? లేదా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం తెలియాల్సి ఉంది.
కాజల్ తెలుగులో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. కాజల్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్టింగ్ విషయంలో కాజల్ కు భర్త నుంచి ఎలాంటి ఆంక్షలు లేవని తెలుస్తోంది. కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. కాజల్ దాదాపుగా 16 సంవత్సరాల పాటు తెలుగులో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించడం గమనార్హం. కథల జడ్జిమెంట్ విషయంలో చాలా సందర్భాల్లో కాజల్ అంచనాలు నిజమయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆచార్యలో మరో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా వరుస ఫ్లాపులు పూజా హెగ్డే కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. పూజా హెగ్డే తర్వాత సినిమాలతో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.