Krithi Shetty: హిట్లూ.. ఛాన్స్‌లూ పోతున్నాయా బేబమ్మా.. ఎందుకని?

ఓవర్‌ నైట్‌ స్టార్‌.. సినిమాల్లో ఇదొక బ్రహ్మ పదార్థం. ఎందుకు, ఎలా, ఎప్పుడు వస్తారో తెలియకుండా రాత్రి రాత్రే స్టార్‌ అయిపోతారు. దానికి కావాల్సిందల్లా ఒక సాలిడ్‌ హిట్‌. హీరోలకు కానీ, హీరోయిన్లకు కానీ ఇదే వర్తిస్తుంది. హీరో అయితే రెండో సినిమా రావడానికి కాస్త సమయం పడుతుంది కానీ.. హీరోయిన్లకు అయితే అవకాశాలు వచ్చేస్తాయి. కాస్త లుక్‌ బాగుండి, క్యూట్‌గా ఉంటే ఆ అవకాశాలు వరుస కడతాయి. కానీ సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. కెరీర్‌ తక్కువ సమయంలోనే ఇబ్బందుల్లో పడుతుంది.

ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉంది కృతి శెట్టి. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచయమైంది కృతి శెట్టి. నిజానికి ఆ సినిమా కోసం ముందు ఎంచుకున్న హీరోయిన్ వేరు… ప్రారంభోత్స‌వంలో కూడా ఆ అమ్మాయే పాల్గొంది. కానీ త‌ర్వాత అనూహ్యంగా కృతి శెట్టి సినిమాలోకి వచ్చింది. సినిమా వచ్చాక.. ఆమె పేరు మారుమోగిపోయింది. బేబమ్మ.. బేబమ్మ అంటూ యువత నామజపమే చేసింది ఏకంగా. అయితే రెండు సినిమాల తర్వాత మెల్లగా ఆ జోరు తగ్గింది.

‘ఉప్పెన’ తర్వాత ‘శ్యామ్ సింగ‌ రాయ్’ మంచి విజయమే అందుకుంది. ఆ తర్వాత ‘బంగార్రాజు’ ఫలితం మాట పక్కనపెడితే.. కృతికి అయితే మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ తర్వాత ‘వారియ‌ర్’, ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలు కెరీర్‌ను కాస్త షేక్‌ చేశాయి. దీంతో తర్వాతి సినిమాల ఎంపిక విషయంలో కృతి జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈలోపు ఓకే అయిన సినిమాలు వెనక్కి వెళ్తున్నాయి. దీంతో కృతికి ఏమైంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

బాలా ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతుందని అనౌన్స్‌ చేసిన సినిమాలో కృతిని నాయిక‌గా అనుకున్నారు. కానీ ఆ సినిమా అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ఆ త‌ర్వాత అరుణ్ విజ‌య్ హీరోగా సినిమాకు కృతిని తీసుకున్నారు. కానీ ఇప్పుడు కృతిని త‌ప్పించి వేరే నాయికను తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో కృతి ఆశ‌ల‌న్నీ నాగ‌చైత‌న్య ‘క‌స్ట‌డీ’ మీదే ఉన్నాయి. ఆ సినిమా తేడా కొడితే ఇక కృతి సింగిల్‌ సినిమా వండర్‌ అయిపోతుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus