‘ఇది పూర్తిగా పర్సనల్ విషయం’, ‘ఇది మా ఇంటి విషయం’, ‘ఈ విషయం మేం చూసుకుంటాం’.. అని చెప్పాల్సిన వాళ్లు ఆ విషయం ఊరు ఊరంతా మాట్లాడుకునేలా చేస్తున్నారు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఎవరి గురించి మాట్లాడుతున్నామో. వాళ్లే రమ్య రఘుపతి – నరేశ్ – పవిత్రా లోకేశ్ గురించే. నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి ప్రెస్ మీట్ పెట్టి నరేశ్ గురించి, పవిత్రా లోకేశ్ గురించి చెప్పడం. ఆ తర్వాత నరేశ్, పవిత్రా లోకేశ్.. రమ్య గురించి వీడియో బైట్‌లు విడుదల చేయడం తెలిసిందే.
ఇక్కడివరకు ఓకే. ఎవరి కష్టం వాళ్లు, ఎవరి బాధ వాళ్లు చెప్పుకోవడం తప్పులేదు. అయితే ఈ విషయంలో రమ్య రఘుపతి అసలు మీడియాకు ఎందుకెక్కారు. నాలుగు గోడల మధ్య జరిగిన విషయలను ఆమె మీడియాకెక్కి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది తెలియాలి. ఆమె మాటల్ని నేరుగా చెప్పే ప్రయత్నం చేస్తే నరేశ్ వినలేదని, తిరిగి అక్రమ సంబంధాలు అంటగట్టారని అని చెప్పారు రమ్య రఘపతి. మరోవైపు తమతో చర్చించకుండా నేరుగా మీడియాకు వెళ్లడం సరికాదని నరేశ్ అంటున్నారు.
భర్త కావాలంటే ఇలానే చేస్తావా? అంటూ రమ్యను ఉద్దేశించి ఆ మధ్య పవిత్రా లోకేశ్ ఓ వీడియోలో చెప్పారు. ఆమె కూడా తన భర్త తనకు కావాలనే అడుగుతున్నారు. ఓవైపు నాకు, అతనికి ఏం సంబంధం లేదని పవిత్రా లోకేశ్ చెప్పడం, మరోవైపు ఆమెకు, నాకు ఏం సంబంధం లేదని నరేశ్ చెప్పడం విన్నాం. కానీ ఇద్దరూ కలసి ఒకే ఇంట్లో ఉండటం మనం మొన్నీ మధ్య బయటికొచ్చింది. ఆ విషయం తెలుసుకున్న రమ్య పోలీసులు, మీడియాతో వెళ్లగా, ఆమెను చూసి వెక్కిరిస్తూ, చప్పట్లు కొడుతూ, ఈలలు వేశాడు నరేశ్.
ఇది విషయాన్ని ఇంకాస్త క్లిష్టం చేసేది తప్ప, సద్దుమణిగేలా చేసేది కాదు. అన్ని నీతి వ్యాక్యాలు చెప్పే నరేశ్ అలా రమ్యను రెచ్చగొట్టడం ఎందుకు అనే ప్రశ్న వస్తోంది. ఆయన రెచ్చగొట్టడంతోనే రమ్య చెప్పు తీశారు. దీంతో కావాలనే రెచ్చగొట్టి నరేశ్ ఇదంతా చేశారని అర్థమవుతోంది. కాబట్టి విషయాన్ని పరిష్కారం దిశగా తీసుకెళ్లకుండా నరేశ్ ఇలా చేస్తున్నారని అనుకోవచ్చా? అసలు పవిత్ర లోకేశ్, నరేశ్ ఒకే ఇంట్లో ఎందుకున్నారు? ఇలాంటి ప్రశ్నలకు నరేశ్ ఏమన్నా వీడియో బైట్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.