Nithya Menen: ‘భీమ్లా నాయక్’ కు దూరంగా నిత్యా మేనన్.. కారణం..!

‘నాయక్ పెళ్ళాం అంటే నాయక్ లో సగం కాదు. నాయక్ కి డబుల్’.. ఈ ఒక్క డైలాగ్ తో ట్రైలర్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది నిత్యా మేనన్. ‘భీమ్లా నాయక్’ నుండీ విడుదల చేసిన రెండు ట్రైలర్లలోనూ నిత్యా మేననే హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. ‘ఏం నాయక్.. కాల్చేముందు సెల్లో వాడున్నాడో లేదో చూసుకోవద్దా’ అనే డైలాగ్ కూడా పవన్ ఫ్యాన్స్ కు మంచి ఊపిచ్చింది.ఈ రెండు డైలాగులే ఈ రేంజ్లో ఉంటే..

Click Here To Watch

సినిమాలో నిత్యా పాత్ర ఇంకే రేంజ్లో ఉంటుందో అనే ఆశలు కూడా ప్రేక్షకులకి కలిగాయి. నిజానికి ఫేడౌట్ దశకు దగ్గర పడుతున్న నిత్యా మేనన్ కు… ‘భీమ్లా’ ఆఫర్ రావడం ఓ బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.కానీ ఆ అవకాశాన్ని ఈమె పూర్తిగా సద్వినియోగపరుచుకోవడం లేదు అనేది అందరి అనుమానం. ఎందుకంటే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈమె డుమ్మా కొట్టేసింది. ప్రమోషన్ లలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసుంటే.. ఆమెకి బాగా ప్లస్ అయ్యేది.

మరి ఆమె ఎందుకు ఈ ఈవెంట్ కు హాజరుకాలేదు. ఈ మధ్యనే నిత్య హైదరాబాద్‌లో ‘ఆహా’ ఓటిటి కోసం ‘ఇండియన్ ఐడల్’ తెలుగు వెర్షన్ కర్టెన్ రైజర్ కి వచ్చింది. మరి ఇంత పెద్ద ఈవెంట్ కు ఎందుకు రాలేదు.తన సోషల్ మీడియాలో ఖాతాల్లో కూడా ‘భీమ్లా నాయక్’ గురించి ఆమె ఒక్క పోస్ట్ వేసింది కూడా లేదు. దీంతో రకరకాల కథనాలు మొదలయ్యాయి. ‘భీమ్లా నాయక్’ లో ఆమె పాత్ర నిడివి కొంచెం ఎక్కువగానే ఉంటుందట.కానీ ఎడిటింగ్లో చాలా వరకు నిత్యా సన్నివేశాల్ని తొలగించినట్టు తెలుస్తుంది.

అందుకే ఆమె ‘భీమ్లా నాయక్’ కు దూరంగా ఉంటుందని వినికిడి. అయితే ఆమె ఓ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉండడంతో ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకాలేదని కొందరంటున్నారు. మరి ఓ పోస్ట్ వేయడానికి ఏమైంది? అంత ఖాళీ లేకుండా ఉంటుందా? అనే కామెంట్లు కూడా ఎక్కువయ్యాయి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus