Vijay: పోస్టర్‌పై తెలుగు కనిపించకుండా చేయడమే ఉద్దేశమా!

తెలుగు సినిమాకు తెలుగులోనే పేరు పెట్టాలి.. అని డిమాండ్‌ చేసేంత చిన్నమనసు మనకు లేదు. ఏ భాషలో పేరు పెట్టినా సినిమా చూసేస్తాం, బాగుంటే హిట్‌ చేసేస్తాం. అయితే సినిమా పోస్టర్‌ మీద తెలుగు అక్షరాలే కనిపించకపోతే.. తెలుగు ప్రేక్షకుల మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. గతంలో ఒకటి రెండు సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి చూశాం. తెలుగు సినిమా పోస్టర్‌ మీద టైటిల్‌ తెలుగులో లేనివి ఉన్నాయి. తాజాగా అలాంటి మరో పోస్టర్‌ లాంచ్‌ అయ్యింది. ఈసారి ఆ పని తెలుగులో సుమారు 50 సినిమాలు నిర్మించిన నిర్మాణ సంస్థ నుండి.

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు – తమిళ భాషల్లో రూపొందుతోందని నిర్మాత చెబుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ ఇటీవల విడుదల చేశారు. విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా లాంచ్‌ చేశారు. సినిమాకు Vaarasudu అని పేరు పెట్టారు. అంతా తెలుగులో రాసి పేరు మాత్రం ఇంగ్లిష్‌లో ఎందుకు రాశారు? అనే డౌట్‌ వచ్చిందా? ఇప్పుడు మాకు వచ్చిన డౌట్‌ కూడా అదే. సినిమా పోస్టర్‌ మీద ‘వారసుడు’ అని తెలుగులో రాయకుండా vaarasudu అని ఇంగ్లిష్‌లో రాసినట్లు?

ఎలా రాసినా, చదివేది వారసుడు అనే కదా అనే మాట కూడా రావొచ్చు. కానీ తెలుగులో ‘వారసుడు’ అని రాస్తే ఏమౌతుంది. సినిమా టీమ్‌ దగ్గర తెలుగు రాసేవాళ్లే లేరా? అనే సరదా జోకులు కూడా వినిపిస్తున్నాయి. తెలుగులో పేరు పెడితే ఇంకా ఎక్కువమంది ఆ సినిమా రీచ్‌ అవుతుందని కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే విజయ్‌ పోస్టర్‌లు బుధవారం కూడా వచ్చాయి. అందులో అయినా పెట్టారా అంటే లేదు అనే చెప్పాలి. మరి ఎందుకు ఇంగ్లిష్‌ మాత్రమే పెట్టారు అనేది తెలియదు.

అన్నట్లు ఈ సినిమాకు సంబంధించి విజయ్‌ తన ట్విటర్‌ ఖాతాలో మూడు ఫొటోలు షేర్‌ చేశాడు. అవన్నీ తమిళ వెర్షన్ ఫొటోలే. అంతెందుకు ఈ సినిమా పోస్టర్‌, టైటిల్‌ తొలుత బయటకు వచ్చింది తమిళ వెర్షన్‌వే. అంతకుముందు ఓసారి విజయ్‌ మాట్లాడుతూ సినిమాను తమిళంలో తీస్తున్నామని, తర్వాత తెలుగులోకి డబ్‌ చేస్తామని చెప్పాడు. కానీ నిర్మాణ సంస్థ మాత్రం బైలింగ్వుల్‌ అంటోంది. ఈ పోస్టర్లు, షేర్లు చూస్తుంటే అసలు ఇది తెలుగు సినిమాయేనా అనిపిస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus