Hari Hara Veera Mallu: వీరమల్లు.. అసలు సౌండ్ లేదేంటీ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి వివిధ కారణాలతో లేట్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల, షూటింగ్ కూడా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే సినిమాలు పూర్తి చేసే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ సమీపంలో వేసిన భారీ సెట్‌లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందని సమాచారం.

Hari Hara Veera Mallu

యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరణతో పనులు ముమ్మరం అవుతున్నాయి. ఈ నెల చివరికి షూటింగ్ పూర్తవుతుందని టాక్. ఈ ప్రాజెక్ట్ పూర్తికావడంతో పాటు పవన్ తన తదుపరి చిత్రం ‘ఓజీ’ (OG) సెట్స్‌లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ‘హరిహర వీరమల్లు’ పవన్ కళ్యాణ్‌కి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో, ఈ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.

అందుకు తోడు, ఫస్ట్ సింగిల్ పవన్ స్వయంగా పాడినట్లు సమాచారం, అది జానపద శైలిలో ఉండబోతుందని అంటున్నారు. దీపావళి కానుకగా ఈ సాంగ్ విడుదల అవుతుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. ఫ్యాన్స్ లో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “అసలు ఈ సైలెన్స్ ఎందుకు?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

వరుస అప్డేట్స్ ఇవ్వాలని కోరుతూ, నిర్మాతలపై ఫ్యాన్స్ ప్రెజర్ పెడుతున్నారు. ఇక సినిమాలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal)  హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటులు బాబీ డియోల్(Bobby Deol) , అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28న విడుదలకు సిద్దమవుతోంది. అయితే, ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

త్రివిక్రమ్ తో సునీల్.. 30 రూపాయల కథ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus