‘దేవర’ (Devara) సినిమా నుండి ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. మూడింటిలోనూ కామన్ ఏంటి అంటే హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. అయితే ఇంకో అంశం ఉంది.. అదే ‘ఈ పాటను ఎక్కడో విన్నట్లు ఉంది కదా’ అనే మాట. కావాలంటే మీరే చూడండి మూడుకు మూడు పాటల ట్యూన్‌లు ఎక్కడో విన్నట్లే అనిపిస్తాయి. వాటిలో తొలి పాట కాస్త బెటర్ కానీ, మిగిలిన రెండు పాటలూ పాత ట్యూన్‌లే.
అయితే ఏంటి అన్నీ హిట్టే కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌గా మారిపోయింది అని అంటున్నారు. బాగా మైండ్‌కి అలవాటు ఉన్న ట్యూన్‌లు, వందలసార్లు విన్న ట్యూన్‌లకు దగ్గరగా ఉండే పాటలు అయితే ఈజీగా జనాలకు బాగా ఎక్కేస్తాయి అనే ఉద్దేశంలో ‘దేవర’ (Devara) టీమ్ ఉంది అని అనిపిస్తోంది. రీసెంట్‌గా టీమ్ నుండది వచ్చిన ‘దావూదీ’ పాట అయితే మరీ దారుణం. ట్యూన్, స్టెప్స్ మొత్తంగా ఓ తమిళ పాట స్ఫూర్తిలా కనిపిస్తోంది.
‘దావూదీ’ పాట విన్నప్పుడు.. ‘అరబిక్ కుత్తు’ పాట కచ్చితంగా మైండ్‌లోకి వస్తుంది. ఇక స్క్రీన్ మీద విజయ్‌లా (Vijay Thalapathy) తారక్ కొన్ని స్టెప్పులు వేస్తుంటే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సేమ్ టైప్ డ్రెస్.. అదే స్టెప్పులు వేసి ‘మీరు ఈ పాటకు మూలం ఏది అని వెతకొద్దు మేం చెప్పేస్తున్నాంగా’ అనేలా చేశారు. ఇక కొత్త అందం జాన్వీ (Janhvi Kapoor) .. తారక్ (Jr NTR) ఈజ్ కలసి పాటకు కొత్త రూపం అయితే వచ్చింది కానీ కొత్తగా వినిపించలేదు.
ఒక్క పాటకే ఇంత మాట అనేస్తారా అనుకోవచ్చు. అయితే 125 మిలియన్ల వ్యూస్ అందుకున్న ‘చుట్టమల్లె..’ పాట కూడా మరో పాటను స్ఫూర్తిగా తీసుకున్నదే అనే విషయం మరచిపోకూడదు. శ్రీలంక పాట ‘మనికె మగే హితే..’కు స్ఫూర్తే. ఆ పాట మ్యూజిక్ డైరక్టరే ఈ మాట చెప్పేశారు. ‘నా పాటను స్ఫూర్తిగా తీసుకుంటే థ్యాంక్యూ ’ అని కూడా చెప్పారు. కాబట్టి పాత ట్యూన్, కొత్త అందం కలిపి హిట్ సాంగ్ పట్టడమే కాన్సెప్ట్‌లా మారిపోయింది.