రెబల్ స్టార్ ప్రభాస్ షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ మూవీ షూటింగ్ సెప్టెంబర్ 2నుండి తిరిగి మొదలుకానుంది. లాక్ డౌన్ ముందు వరకు నిరవధికంగా జరిగిన ఈ షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ లవ్ డ్రామాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. కాగా టాలీవుడ్ లో లాక్ డౌన్ తరువాత షూటింగ్ ప్రకటించిన మొదటి హీరోగా ప్రభాస్ నిలిచాడు.
రాధే శ్యామ్ షూటింగ్ పై మాత్రమే అప్డేట్ ఉంది. మిగతా స్టార్ హీరోల షూటింగ్స్ కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడగా, తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించలేదు. చరణ్, ఎన్టీఆర్ కలిసినటిస్తున్న మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ పై రాజమౌళి ప్రకటన చేయలేదు. ఆంక్షల మధ్య ఆ మూవీ షూటింగ్ జరిపే ఆస్కారం లేదని తెలుస్తుంది.
ఇక బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీ షూటింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. అలాగే దర్శకుడు పరుశురాం తో మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్ పై కూడా ప్రకటన లేదు. మరి ఈ స్టార్ హీరోలందరూ ఎప్పుడు షూటింగ్స్ పై అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.