విజయ్ దేవరకొండ లేటెస్ట్ వీడియో టాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. తనని టార్గెట్ చేస్తూ రాసిన కొన్ని వెబ్ సైట్స్ ఉద్దేశిస్తూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని వెబ్ సైట్స్ కి విలువలు లేవని, డబ్బుల కోసం ఎలాంటి రాతలైనా రాస్తారని చెప్పుకొచ్చాడు. సుధీర్గంగా సాగిన ఆయన ప్రసంగంలో లేవనెత్తిన అంశాలు… వీడియోని ప్రెజెంట్ చేసిన విధానం చాలా మందికి నిజమే కదా అనిపించేలా ఉంది. ఆ వీడియో కోసం ఆయన కొన్ని రోజుకు కష్టపడి కసరత్తు చేశాడని అర్థం అయ్యింది.
సామాన్యుల నుండి టాలీవుడ్ ప్రముఖుల వరకు విజయ్ ని యెస్ యూ యార్ కరెక్ట్ అని పొగిడారు. ఫేక్ న్యూస్ ని అంతం చేయడంలో నీ వెనుక మేమున్నాం అని మద్దతు ఇచ్చారు. ఐతే విజయ్ దేవరకొండ బయటికి వచ్చే వరకు వీళ్ళ ధైర్యం ఏమైంది. మహేష్, చిరు వంటి వారు విజయ్ దేవరకొండను భేష్ అని పొగిడారు. తాము కూడా గతంలో ఇలాంటి మీడియా రాతల వలన ఇబ్బంది పడ్డామని సోషల్ మీడియా వేదికగా అక్కసు.. ఆవేదన వెళ్లగక్కారు. మరి విజయ్ దేవరకొండ వలే వీరు ఎందుకు మీడియా ఆగడాలను ప్రశ్నించలేదు.
మీడియాను ఎదిరించడానికి వీరికి ఎందుకు ధైర్యం చాల లేదు?. పరిశ్రమను శాసించే స్థాయిలో ఉన్నవారు కూడా ఇంత వరకు ఎందుకు నోరు మెదపలేదు?. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మూవీ రివ్యూ వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని అప్పట్లో ప్రణాళిక వేశారు. ఆ సమయంలో కూడా చిరు, మహేష్ వారికి మద్దతుగా స్పందించ లేదు. ఇప్పుడు సడన్ గా మీడియాపై యుద్ధం అంటున్నారు. ఎవరో వెనుక వస్తారని తెగిస్తే ఆ నష్టం విజయ్ కే కానీ, వెనకుండి ఎగదోసే వారికి కాదు.
Most Recommended Video
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు