Prabhas: ఆ సమస్య వల్లే ప్రభాస్ క్యాప్ పెట్టుకుంటున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ లుక్ కు ఫిదా కాని ప్రేక్షకులు దాదాపుగా ఉండరు. ప్రభాస్ కు రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ 3,000 కోట్ల రూపాయలు అంటే ఆయనపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందో సులువుగానే అర్థమవుతోంది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు నిరాశపరిచినా సలార్ మూవీ బాహుబలి2 సినిమాను మించి సక్సెస్ ను అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఎక్కువగా క్యాప్ లో కనిపిస్తూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ కొత్త అలవాటు గురించి ఫ్యాన్స్ మధ్య కూడా చర్చ జరుగుతోంది. హెయిర్ లాస్ వల్లే ప్రభాస్ క్యాప్ పెట్టుకుంటున్నారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్ల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ క్యాప్ ధరించడానికి ఇదే కారణమని చాలామంది భావిస్తున్నారు. అయితే ప్రభాస్ హెయిర్ లాస్ కు సంబంధించి కేర్ తీసుకుంటూ ఉండవచ్చని త్వరలో ప్రభాస్ మళ్లీ మునుపటి లుక్ లో కనిపిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ఈ రెండు సినిమాలు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లు కావడం గమనార్హం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండేలా ఈ సినిమాల దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2023 సంవత్సరంలో సలార్ రిలీజ్ కానుండగా 2024 సంవత్సరంలో ప్రాజెక్ట్ కే రిలీజ్ కానుంది.

కొన్ని నెలల గ్యాప్ లో ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. గత సినిమాలకు సంబంధించి లుక్ విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus