‘ఆర్ఆర్ఆర్’ సినిమా రూ. వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసింది అని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం. అయితే ఆ ఆనందాన్ని తెలుగువారితో పంచుకోవడానికి, తెలుగు మీడియాకు చెప్పుకోవడానికి రాజమౌళి ముందుకు రావడం లేదా? అవుననే అంటున్నాయి ఆయన రీసెంట్ మూమెంట్స్. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇటీవల ముంబయిలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు కూడా. కానీ అలాంటి కార్యక్రమమేదీ మన దగ్గర జరగలేదు.
‘ఆర్ఆర్ఆర్’ ప్రచారం విషయంలో రాజమౌళి టీమ్ ఆలోచనలు మొదటి నుండి ఇలానే ఉన్నాయి. సినిమా ప్రారంభమైన కొత్తలో ఓ ప్రెస్ మీట్ పెట్టారు. రిలీజ్‌కి ముందు ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. సక్సెస్ అయ్యాక ఓ ప్రెస్ మీట్ ఇంతే. సినిమాకు ఇంతటి విజయం అందించిన మన తెలుగు ప్రేక్షకుల మధ్యలో అలాంటి ఈవెంట్ ఏదీ జరగలేదు. కనీసం ప్రెస్‌మీట్ కూడా లేదు. ఇదంతా రాజమౌళి టీమ్ ఎందుకు చేస్తున్నట్లు. ఇప్పుడు ఈ ప్రశ్నే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఒకప్పుడు సినిమా విడుదల అంటే… రిలీజ్‌కి నెల రోజుల ముందు నుండే హైదరాబాద్‌లో ప్రచారం మోత మోగిపోయేది. ఇప్పటికీ అలానే జరుగుతోంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో ఇలా లేదు. సినిమా టీమ్ అన్ని ఊళ్లు తిరిగేసి ఆఖరి ‘హమ్మయ్య అంటూ’ హైదరాబాద్‌లో పడ్డారు. ఈ క్రమంలో వాళ్లు ముందుగానే షూట్ చేసుకున్న వీడియోలు ఒక్కొక్కటిగా విడుదల చేశారు. కానీ మీడియాతో నేరుగా మాట్లాడింది లేదు. ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు.
ఏదో ఒకటి రెండు టీవీఛానల్స్‌కి వెళ్లి ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు గుర్తు. పేపర్లలో అయితే ఇంటర్వ్యూలు లాంటివి కనిపించలేదు. దీంతో రాజమౌళి టీమ్ ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రశ్నగా మారింది. అయితే ‘బాహుబలి 1’ సమయంలో తెలుగు మీడియా నుండి కావాలనే నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌లు, రివ్యూలు ఇచ్చారని అందుకే ఆ మీడియా ఆయన దూరంగా ఉన్నారని అంటారు. అయితే ఇప్పుడు ‘ఆర్ఆర్‌ఆర్’కి కూడా అలాంటి రివ్యూలే వచ్చాయి. దీంతో రాజమౌళి తెలుగు మీడియాను అంత దగ్గరకు తీసుకోవడం లేదు అని అంటున్నారు.
ముంబయిలో సక్సెస్ మీట్ పెట్టి, ఇక్కడ పెట్టకపోవడం ఏంటో… తెలుగు పేపర్లలో ఆయన ఇంటర్వ్యూలు లేకపోవడం ఏంటో… అన్ని తెలుగు టీవీల్లో ఒకరే ఇంటర్వ్యూలు చేయడమేంటో… అంతా ఏంటో ఏంటోగానే సాగిపోయింది ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారం. కనీసం వచ్చే సినిమా అదే మహేష్‌బాబు సినిమాకైనా తెలుగు ప్రచారం ఉంటుందేమో చూడాలి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!