తారక్‌కి జపాన్‌లో క్రేజ్ ఎక్కువ, భారతీయ సినిమాలకు చైనాలో మోజెక్కువ, రాజమౌళి పనితనానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇవి చాలదా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఆయా దేశాల్లో విడుదల చేయడానికి. ఇంత ఈజీ పాయింట్‌ను రాజమౌళి మరచిపోయారా? అవుననే అనిపిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆలోచనలు చూస్తుంటే. ఈ సినిమా ఇంటర్నేషనల్ రిలీజ్ గురించి టీమ్ ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన చేయకపోవడమే దీనికి కారణం. దీంతో ‘ఆర్ఆర్‌ఆర్’ను రాజమౌళి మరచిపోయారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కనిపిస్తున్నాయి.
రామ్‌చరణ్, తారక్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకుపైగా రాబట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి’ రికార్డులు బద్దలయ్యాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘బాహుబలి 2’ రికార్డు అలానే ఉంది. దీన్ని బద్దలు కొట్టాలంటే సినిమా ఇంటర్నేషనల్ వెర్షన్‌ను రిలీజ్ చేయాలి. అయితే ఈ విషయంలో ‘ఆర్‌ఆర్ఆర్’ ఆలోచనలు ఏంటో అర్థం కావడం లేదు. సినిమా థియేటర్లలో వచ్చి అదరగొట్టి, ఓటీటీలో వచ్చి వావ్ అనిపిస్తోంది.
కానీ ఇంటర్నేషనల్ రిలీజ్ సంగతి ఇంకా తేలడం లేదు. సినిమాకు ఇప్పటికే అంతర్జాతీయంగా మంచి బజ్ ఉంది. ఓటీటీలో విడుదలవ్వడంతో ఆయా ఓటీటీ సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారంతో ఆ సినిమా గురించి అందరికీ చెబుతున్నాయి. ఈ సమయంలో సినిమా ఇంటర్నేషనల్ కట్‌ను చైనా, జపాన్ లాంటి దేశాల్లో విడుదల చేస్తే వావ్ అనిపిస్తుంది అంటున్నారు పరిశీలకులు. ‘బాహుబలి’ ఇంటర్నేషనల్ కట్ ఒకటి రెడీ చేసి రిలీజ్ చేశారు. కాబట్టే ‘బాహుబలి 2’ కలెక్షన్లు రూ.1800 కోట్లకు చేరాయి.
అంతెందుకు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘దంగల్’. ఈ సినిమా అంత మొత్తంలో సంపాదించింది అంటే అందులో చైనా నుండి వచ్చిన రూ. 1200 కోట్లు ఉన్నాయి కాబట్టే. మరి ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలో రాజమౌళి అలాంటి పని ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న వినిపిస్తోంది. తర్వాత చేయబోయే మహేష్‌బాబు సినిమా మీద దృష్టి పెట్టడం వల్లే ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇంటర్నేషనల్ రిలీజ్ పక్కన పెట్టేశారా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!