ఇటీవల కాలంలో సమంత పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఓవైపు వివాహ బంధం నుండి దూరమైంది, ఆ వెంటనే అనారోగ్యం పాలైంది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా అంటూ సమంత చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమెకు అభిమానుల నుండి, తెలుగు మీడియా నుండి చాలా సపోర్టు వచ్చిందని చెప్పాలి. ఆమె తన వారికి, తన అభిమానులకు చెప్పాలనుకున్న విషయాల్ని మీడియా అందరికీ చేరవేసింది. అయితే ఇప్పుడు అదే సమంత.. తన విషయాల్ని తెలుగు మీడియా ముందు చెప్పడానికి ఇబ్బందిపడుతోందా? ఆమె ప్రవర్తన చూస్తుంటే అలానే అనిపిస్తోంది.
‘యశోద’ సినిమా సమయంలో సమంత అనారోగ్యంతో బాధపడుతూనే డబ్బింగ్ చెప్పింది. ఆ తర్వాత ఆ సినిమా ప్రమోషన్‌ను కూడా ఇంచుమించు అలానే చేసింది. ఇప్పుడు ‘శాకుంతలం’ విషయంలోనూ సమంత ఇలానే చేసింది. సినిమాను గతంలో రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు, ప్రచార కార్యక్రమాలకు అనారోగ్యంతోనే వచ్చింది. ఈ క్రమంలో ఆమె సినిమా కోసం పడుతున్న కష్టాన్ని ఇదే మీడియా కొనియాడుతూ వార్తలు రాసింది. అయితే తాజాగా సమంత ఇక్కడ మాట్లాడటానికి ఆసక్తి చూపించడం లేదు.
మొన్నీమధ్య జరిగిన ‘శాకుంతలం’ ప్రెస్ మీట్‌కు కూడా సమంత రాలేదు. అలా అని బయటకు రావడం లేదా అంటే.. బాలీవుడ్ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ముంబయి వెళ్లి వస్తోంది. పోనీ ఏ విషయం ఎవరితోనూ మాట్లాడకూడదు అనుకుంటోందా అంటే.. ఇంగ్లిష్ మీడియాకు, సోషల్ మీడియాకు రోజూ స్టఫ్ ఇస్తోంది. దీంతో తెలుగు మీడియాకు ఎందుకు సామ్ ముఖం చాటేస్తోంది అనే చర్చ మొదలైంది. మొన్నీమధ్య జరిగిన ఓ తెలుగు ఈవెంట్‌లో పర్సనల్ ప్రశ్నలు వద్దు అంటూ టీమ్ ముందే చెప్పేసింది.
సమంత (Samantha) బయటకు వచ్చినప్పుడు ఏమీ అడగొద్దని, ఆమె చెప్పిందే, సోషల్ మీడియాలో రాసుకున్నదే తెలుగు మీడియా రాసుకోవాలి అని అనడం ఎంతవరకు సబబో ఆమెకే తెలియాలి. ఇదంతా చూస్తుంటే సమంత ఏమన్నా తప్పించుకుంటుందో అనిపిస్తోంది. ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడకపోతే.. ఇక్కడా మాట్లాడక్కర్లేదు. అడిగేవాళ్లు ఉన్న దగ్గర మాట్లాడను అనుకుంటే ఏమీ చేయలేం అనేది తెలుగు మీడియా మాట.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?