రాజమౌళి సినిమాలో శ్రియ పరిస్థితి ఇంతేనా?

ప్రతి సినిమాకు ఎడిటింగ్‌ టేబుల్‌ మీద చాలా పని ఉంటుంది అంటుంటాయి టాలీవుడ్‌ వర్గాలు. సినిమాను తీసుకుంటూ పోయి చూస్తే ఫుటేజ్‌ చాలా కనిపిస్తుంది. దానిని ఓ లెవల్‌లోకి తీసుకొచ్చి సినిమాగా చేస్తుంటారు. చాలా సినిమాల విషయంలోనూ ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ప్లానింగ్‌ పక్కాగా ఉండే రాజమౌళి సినిమా విషయంలో ఇలానే జరగడం గమనార్హం. ఇటీవల సినిమాలు చూస్తే ఓ కామన్‌ పాయింట్‌ మాత్రం కనిపిస్తుంది. అదే శ్రియ. అదేంటి రాజమౌళి రీసెంట్‌ సినిమాలో శ్రియ లేదు కదా అంటారా. అక్కడే ఉంది పాయింట్‌.

‘బాహుబలి’ రెండు సినిమాల సమయంలో సోషల్‌ మీడియాలో ఎక్కువగా వినిపించిన ప్రశ్నలు ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’, రెండోది ‘భళ్లాలదేవ భార్య ఎవరు?’. మొదటి ప్రశ్నకు రెండో పార్టులో సమాధానం వచ్చేసింది. రెండో దానికి ఇంకా లేదు. సినిమాలో భళ్లాలదేవ కుమారుడిగా భద్రుడుగా అడివి శేష్‌ కనిపిస్తాడు. కొడుకు ఉన్నాడు, భార్య ఎవరు అని చాలామంది ప్రశ్నించారు. అయినా చిత్రబృందం చెప్పలేదు. అయితే ఆ పాత్ర చేసింది శ్రియ అని… నిడివి ఎక్కువవడంతో ఆ పాత్రను తీసేశారని వార్తలొచ్చాయి.

ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో శ్రియ సీన్స్‌ తీసేస్తున్నారని వార్తలొస్తున్నాయి. కీలక పాత్ర కోసం శ్రియను తీసుకున్నా, నిడివి పెరిగిపోయిందనే కారణంతో తీసేస్తున్నారని అంటున్నారు. అయితే మొత్తం పాత్ర తీసేస్తున్నారా, కొన్ని సీన్సేనా అనేది తెలియడం లేదు. దీంతో శ్రియ విషయంలో రాజమౌళి ఇలా ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు సోషల్‌ మీడియాలో డిస్కషన్‌ పాయింట్‌. ఎలాగూ జక్కన్న టీమ్‌.. ఇలాంటి డిస్కషన్స్‌కి ఆన్షర్‌ చెప్పదు. ఈసారైనా చెబుతుందా? చూద్దాం!

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus