స్టార్‌ కమెడియన్లు ఇలా ‘జబర్దస్త్‌’ను వదిలేస్తున్నారేంటి?

ఆ రోజుల్లో… అని ఓ పెద్ద హీరో అంటుంటారు గుర్తుందా? ఇప్పుడు ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ చూస్తే ఆ మాటే అనాలని అనిపిస్తోంది. కారణం ఆ నవ్వుల కార్యక్రమానికి తగ్గుతున్న ఆదరణ, షో నుండి బయటకు వెళ్లిపోతున్న సీనియర్‌ అండ్‌ హైలీ టాలెంటెడ్‌ కమెడియన్స్‌. కావాలంటే మీరే చూడండి గత కొన్ని నెలలుగా చూస్తుంటే చాలామంది టాప్‌ కమెడియన్స్‌ షో నుండి దూరంగా జరుగుతున్నారు. తాజాగా సుధీర్‌ కూడా ‘జబర్దస్త్‌’ నుండి పక్కకు తప్పుకున్నాడు. అంతకుముందే గెటప్‌ శ్రీను వెళ్లిపోయాడు.

‘జబర్దస్త్‌… ఖతర్నాక్‌ కామెడీ షో’ అని వచ్చినా, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌… ఖతర్నాక్‌ కామెడీ షో’ అని వచ్చినా, రెండూ ఒక్కటే. ఇటు కమెడియన్లు, అటు కమెడియన్లు ఇటు మారుతూ ఉంటారు. నవ్వులు పూయిస్తూ ఉంటారు అయితే గత కొన్ని నెలలుగా చూస్తే తొలుత హైపర్‌ ఆది ‘జబర్దస్త్‌’ నుండి తప్పుకున్నాడు. కారణాలేం చెప్పినా.. జబర్దస్త్‌ నుండి అయితే బయటకు వచ్చేశారు. గెటప్‌ శ్రీను అయితే కొన్ని వారాలుగా స్కిట్‌ చేయడం లేదు. ఎప్పుడో అడపాదడపా వచ్చి స్కిట్‌ చేసి వెళ్తున్నాడు.

అయితే ఈ వారం జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌ టీమ్‌ను పూర్తిగా తీసేశారు. ఆ స్థానంలో ఆటో రామ్‌ ప్రసాద్‌ టీమ్‌ వచ్చింది. సుధీర్‌ టీమ్‌ విషయంలో పుకార్లకు తావివ్వకూడదు అనేమో రామ్‌ప్రసాద్‌తోనే శ్రీను, సుధీర్‌ జబర్దస్త్‌ నుండి తప్పుకున్నట్లు చెప్పించేశారు. ఇలా సీనియర్‌ కమెడియన్లు వెళ్లిపోవడం జబర్దస్త్‌కి కొత్తేమీ కాదు. గతంలో చమ్మక్‌ చంద్ర, ధన్‌రాజ్‌, వేణు లాంటివాళ్లు వెళ్లిపోయారు. అయితే రేటింగ్‌లు తగ్గుతున్నాయని వార్తలొస్తున్న సమయంలో ఇలా వెళ్లిపోవడం ఆలోచించదగ్గర అంశమే.

పోనీ పూర్తిగా ఈటీవీ నుండి వెళ్లిపోతున్నారా? అంటే అలా కూడా కాదు. సుధీర్‌ ప్రస్తుతం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో యాంకర్‌గా చేస్తున్నాడు. మరోవైపు ‘ఢీ’లోకి త్వరలో అడుగుపెడతా అని కూడా చెప్పాడు. ఇక హైపర్‌ ఆది ‘ఢీ,’ ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో చేస్తున్నాడు. మరి ఆ ప్రోగ్రామ్స్‌లో చేసి, ‘జబర్దస్త్‌’ ఎందుకు మానేయడం అనేది అర్థం కావడం లేదు. అన్నట్లు మాటీవీలో ఇటీవలో స్టార్ట్‌ అయిన కొత్త ప్రోగ్రామ్‌లో సుధీర్‌ ఉన్నాడు. ఇదేం లెక్కో మరి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.