‘పుష్ప’ సినిమా విడుదలైన వెంటనే ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని చెప్పుకొచ్చింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. సినిమా అయితే అనుకున్నట్లుగా మొదలుకాలేదు. ఏకంగా ఏడాది ఆలస్యంగా సినిమా షూటింగ్ మొదలైంది. ఈ క్రమంలో ఏమవుతోంది, ఏమవుతోంది అని ఫ్యాన్స్ ఏకంగా గీతా ఆర్ట్స్ ముందు (?) నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు చాలాసార్లు జరిగింది. అయితే ఎట్టకేలకు మొదలై.. గ్లింప్స్ కూడా వచ్చేసింది.
‘పుష్ప’ ఎక్కడ.. అంటూ ఓ టీజర్, వీడియోను విడుదల చేశారు. ఏదో సీక్రెట్‌ను చెబుతారేమో అని అందరూ అనుకుంటే.. ఫైర్ లాంటి పుష్ప వెనుక.. ఉన్న మంచితనం కూడా చూపించారు. ఇదంతా వినడానికి, చూడటానికి చాలా బాగుంది. అయితే ఇక్కడే ఓ డౌట్ వస్తోంది. రెబల్‌గా కనిపించే పుష్పను కాస్త సాఫ్ట్ కార్నర్‌ను చూపించే ప్రయత్నం చేశారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఫైర్ లాంటి పుష్పను మంచితనానికి మారు పేరు పుష్ప అని చెప్పే ప్రయత్నం చేశారు.
‘పుష్ప’ తొలి సినిమా చూస్తే.. పుష్ప చాలా రెక్‌లెస్‌గా ఉండే వ్యక్తి. పోలీసు అయినా, ఓనర్ అయినా, అదెవరయినా తన దారి తనదే. ఎదిగే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు కూడా. తను, తన అమ్మ, తన శ్రీవల్లి, తన ఇంటి పేరు, తన బ్రాండ్, తన కుటుంబం ఇదే అతని జీవితం. బాగా ఎదిగి తన ఇంటి పేరు, పరువు సంపాదించాలి అనుకుంటాడు. అదే సాధిస్తాడు కూడా. రెండోపార్టులో ఇంతే ఉంటుంది.. దాన్ని ఇంకాస్త ఎక్స్‌టెంట్ చేస్తారు అనుకున్నారంతా.
కానీ కొత్త టీజర్ చూశాక ‘పుష్ప’ను రాబిన్‌హుడ్‌లా మార్చేశారు అని చెప్పొచ్చు. కుటుంబం కోసం చేస్తున్నాడు ఇదంతా అనుకున్న వాళ్లకు కాదు ఊరి జనాల కోసం అని చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఇన్ని నెలల పాటు టీమ్ అంతా కూర్చుని చేసిన మార్పులు పుష్పకు కొత్త కలరింగ్ ఇవ్వడమేనా అని అంటున్నారు. సగటు తెలుగు కమర్షియల్ సినిమా విత్, సుకుమార్ కోటింగ్‌లా పుష్ప 2 ఉండబోతోంది అనే డౌటానుమానం వచ్చేస్తోంది.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!