విజయ్ దేవరకొండ ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరో. ఇతనికంటే ముందు వచ్చిన హీరోలు సైతం అందుకోలేని క్రేజ్ ను ఇతను సొంతం చేసుకున్నాడు. యూత్ ను కూడా ఇతను అన్ని విషయాల్లో ప్రభావితం చేస్తాడు. డ్రెస్సింగ్ దగ్గర్నుండీ ఇతని బాడీ లాంగ్వేజ్ వరకూ ఇతన్ని అనుసరిస్తూ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు కరోనా వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోతుంది.
ఇలాంటి పరిస్ధితుల్లో ఎంతో మంది స్టార్ హీరోలు… యంగ్ హీరోలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు. కానీ ఎంతో ఉత్సాహంగా ఉండే విజయ్ దేవరకొండ మాత్రం ముందుకు రాలేదు. కరోనా నుండీ మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అని ఓ వీడియోని అయితే చేసాడు కానీ డొనేషన్ విషయంలో వెనకడుగు వేసాడు. అతను ఎందుకు ఇలా వెనకడుగు వేసాడు అంటే… ఓ వార్త వినిపిస్తుంది. విజయ్ తన సొంత ఇంటి నిర్మాణం కొరకు ఇప్పటి వరకూ సంపాదించింది అంతా…. పెట్టేసాడట.
ఇప్పుడు విజయ్ దగ్గర డబ్బు పెద్దగా లేదు. పోనీ ఓ లక్షో… రెండు లక్షల్లో ఇస్తే ఓ రేంజ్ లో ట్రోల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. డొనేషన్ అనేది తరాల పర్సనల్ విషయం. అందుకు ఎవ్వరూ ప్రశ్నించడానికి సరిపోరు అనేది వాస్తవం.. మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి కూడా..!
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్