2023లో అక్కినేని హీరోల జాతకం మారుతుందా?

ఈ ఏడాది అక్కినేని హీరోలకు పెద్దగా కలిసిరాలేదనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్కినేని అఖిల్ నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ కాలేదు. 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో ఏజెంట్ రిలీజ్ కానుండగా త్వరలో రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

అక్కినేని అఖిల్ ఖాతాలో ఒక ఇండస్ట్రీ హిట్ చేరితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అక్కినేని హీరోలకు అలాంటి సక్సెస్ ఎప్పటికి దక్కుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు నాగచైతన్య 2022 కలిసిరాలేదు. బంగార్రాజుతో నాగచైతన్య సక్సెస్ ను అందుకున్నా తెలంగాణలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.. థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాల ఫలితాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ రెండు సినిమాలు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయనే సంగతి తెలిసిందే.

2023లో రిలీజయ్యే ప్రాజెక్ట్ లతో చైతన్య కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. ఈ సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే మాత్రమే నాగచైతన్య కెరీర్ పరంగా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరో అక్కినేని హీరో నాగార్జున పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు.

ప్రయోగాత్మక సినిమాలు నాగార్జునకు భారీ షాక్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. బంగార్రాజు మినహా ఈ మధ్య కాలంలో నాగార్జునకు సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే. 2023లో అక్కినేని హీరోల జాతకం మారుతుందేమో చూడాల్సి ఉంది. అక్కినేని హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus